అల్లుఅర్జున్–అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ #AA22xA6 (అల్లుఅర్జున్ 22వ సినిమా, అట్లీ 6వ సినిమా)పై వరుస గాసిప్స్ వెలువడుతున్నాయి. హీరో నాలుగు గెటప్స్‌లో కనిపిస్తాడంటూ వార్తలు షేక్ చేశాయి. కానీ మా సోర్సెస్ ద్వారా వచ్చిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం—
నాలుగు కాదు… రెండు పాత్రలే
అల్లుఅర్జున్ ఈ సినిమాలో ఫోర్ రోల్స్ కాదు, ట్రిపుల్ రోల్ కూడా కాదు. కేవలం డ్యూయల్ రోల్ చేస్తున్నారు. రెండూ పూర్తిగా భిన్నమైన క్యారెక్టర్స్ – వయసు, లుక్, మ్యానరిజం, గెటప్ అన్నీ వేరువేరు.
ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రత్యేక సెట్‌పై ఒక పాత్రకు సంబంధించిన కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న అధునాతన టెక్నాలజీ సిస్టమ్స్ ఆ సెట్ హైలైట్. షూటింగ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్‌ని సీమ్లెస్‌గా మిక్స్ చేయడానికి వీటిని ఏర్పాటు చేశారు.
స్క్రిప్ట్ ఫ్లో ప్రకారం అట్లీ ప్రస్తుతం సినిమా ప్రారంభంలో వచ్చే పాత్ర సీన్స్‌ను ఫినిష్ చేస్తున్నారు. అందుకే అల్లుఅర్జున్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో పెద్దగా మార్పు కనిపించట్లేదని ముంబై ట్రిప్స్‌లో గమనించినవారికి క్లారిటీ వస్తుంది. ఇంకో పాత్ర షూట్ తర్వాతి షెడ్యూల్‌లో జరగనుంది.
పాన్-ఇండియా దాటి… గ్లోబల్ మార్కెట్ లక్ష్యం
అట్లీ ఈసారి ఒక యూనిక్ సై-ఫై మాస్ మసాలా స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆయన లక్ష్యం కేవలం పాన్-ఇండియా స్థాయి కాదు, మరింత పెద్ద మార్కెట్‌ని టార్గెట్ చేయడం. ఈ ప్రాజెక్ట్‌తో తన డైరెక్షన్ కెరీర్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాలని చూస్తున్నారు.
దీపిక పదుకొనే కన్ఫర్మ్ – ఇంకా నాలుగు హీరోయిన్స్
మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా దీపికా పదుకొనే పేరు మాత్రమే ప్రకటించారు. కానీ సినిమాలో ఇంకా మరిన్ని నలుగురు హీరోయిన్‌లు ఉండబోతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ పేర్లు మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత ముంబై షెడ్యూల్ పూర్తయ్యే వరకు, నెక్ట్స్ హీరోయిన్ పేరు రివీల్ చేయబోమని టీమ్ నిర్ణయించింది.
మొత్తానికి, డ్యూయల్ రోల్‌లో అల్లుఅర్జున్ – హాలీవుడ్ టెక్నాలజీతో అట్లీ యాక్షన్-సైఫై మసాలా – గ్లోబల్ మార్కెట్ టార్గెట్ … ఇవన్నీ కలిపి AA22xA6పై భారీ అంచనాలను సృష్టిస్తున్నాయి.