సూపర్‌స్టార్ రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘కూలీ’ భారీ అంచనాల నడుమ విడుదలై భారీగా ఓపెన్ అయ్యింది. ‘జైలర్’ సక్సెస్ తర్వాత సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌పై మరీ పెద్ద బెట్స్ వేసింది. రజినీకి ఏకంగా ₹150 కోట్ల రెమ్యునరేషన్ , లోకేష్‌కు ₹50 కోట్లు ఇచ్చేశారు.
రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్మేసి భారీగా వసూలు చేశారు.
తమిళనాడులో, ఓవర్సీస్ రైట్స్‌తోనే మేకర్స్ బాగానే క్యాష్ చేసుకున్నారు.
నార్త్ ఇండియా, తెలుగు రైట్స్‌లో చిన్న లాస్ ఉన్నా, అది పెద్దగా పట్టించుకునే స్థాయిలో లేదు.
అయితే, సినిమా క్వాలిటీపై మాత్రం బోల్డంత నెగటివ్ టాక్ వచ్చింది. హడావిడిగా షూట్ పూర్తి చేసిన కారణంగా టెక్నికల్ వాల్యూ తగ్గిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మొత్తానికి, అంచనాలను అందుకోలేకపోయినా… సన్ పిక్చర్స్ కి కూలీ ఖచ్చితంగా మంచి లాభాలనే ఇచ్చింది.