ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలు వస్తే టిక్కెట్ రేట్లు పెరగడం, స్పెషల్ షోలు పెట్టడం ఓ రొటీన్‌లా మారిపోయింది. నిర్మాతలకు ఇది మిలియన్ల లాభాలు తెచ్చిపెట్టొచ్చు, కానీ సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీకి మాత్రం సినిమా అనుభవం కాస్త భారమైపోతుంది. థియేటర్‌లో ఫ్యామిలీతో కలిసి ఆనందంగా సినిమా చూడాలన్న కలని ఇబ్బంది పెడుతుంది. అయినా కూడా, మాస్ సినిమాలు వచ్చేసరికి ఆ హైప్ ముందు ఆలోచనలన్నీ మసకబారిపోతాయి. ఎంత టిక్కెట్ అయినా కొనేసి వెళ్లిపోతారు. దాంతో ఆ సినిమాలు తర్వాత రిలీజ్ చిన్న సినిమాలకు దెబ్బ పడుతోంది. వాటికి డబ్బు తీయటానికి ఇంట్రస్ట్ చూపటం లేదు.

ఈ క్రమంలో దసరా బరిలో దిగుతున్న పవన్ కళ్యాణ్ “OG” (సెప్టెంబర్ 25) , రిషబ్ శెట్టి “కాంతారా: Chapter 1” (అక్టోబర్ 2) – ఈ రెండు సినిమాలు ఇప్పుడు టిక్కెట్ హైక్ చర్చలతో హీటెక్కుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం మాత్రం “హైక్, స్పెషల్ షోలు లేవు” అని స్పష్టంగా చెప్పేసింది.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెద్ద సినిమాలకు హైక్‌లు, స్పెషల్ షోలు రెడీగా అనుమతులు వస్తున్నాయి. OG కి ఎక్స్‌ట్రా షోలు కూడా ఖాయమని టాక్.

కాంతారా టీమ్ కూడా కర్ణాటకలో టిక్కెట్ హైక్ కోసం దరఖాస్తు చేసుకుంది. కొత్త GO కూడా పాస్ కావడంతో అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సులున్నాయి.

నీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే… తాజాగా మిరాయ్ , కిష్కింధపురి సినిమాలు ఎలాంటి టిక్కెట్ హైక్ లేకుండానే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇది చూస్తే ఆడియన్స్ రేట్ల పెంపును ఇష్టపడటం లేదనే క్లారిటీ వస్తోంది.

అయినా పెద్ద సినిమాల బడ్జెట్, బిజినెస్ రేంజ్ వేరే కాబట్టి OG, Kantara కోసం హైక్ తప్పదన్నది మేకర్స్ నమ్మకం.

, , , , , , ,
You may also like
Latest Posts from