కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మలయాళ సూపర్ హీరో సినిమా లోకా చాప్టర్-1: చంద్ర (తెలుగులో కొత్త లోకాగా విడుదలైంది) అంచనాలు లేకుండా వచ్చి, వసూళ్ల తుఫాన్ సృష్టించింది. మలయాళంలోనే కాదు… తెలుగులోనూ ఈ సినిమా కలెక్షన్లతో అదరగొట్టేసింది.

25 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 275 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అందులో కేరళలోనే 104 కోట్ల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 కోట్లు, విదేశాల్లో ఏకంగా 116 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది.

లోకా చాప్టర్-1 చంద్ర ఇప్పుడు మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. పృథ్వీరాజ్ – మోహన్ లాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఎల్2: ఎంపురాన్ కలెక్షన్లను కూడా అధిగమించింది.

ఇంకా 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తే 300 కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతుంది. అలాగే కేరళ ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి మరో 15 కోట్లే సరిపోతాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ రెండు మైలురాళ్లు కూడా దాటడం ఖాయమని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నస్లెన్ కె. గఫూర్, శాండీ మాస్టర్, అరుణ్ కురియన్, విజయరాఘవన్ కీలక పాత్రల్లో నటించగా… దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ స్పెషల్ క్యామియోలు ఇచ్చారు.

ఆగస్టు 28న రిలీజ్ అయిన ఈ సినిమా… ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది!

, , , , ,
You may also like
Latest Posts from