కేరళలో కార్ల స్కామ్ విషయం భారిగా కలకలం రేపేలా కనపుడుతోంది. నిన్న కస్టమ్స్ అధికారులు చాలా మంది సినిమా వాళ్ల ఇళ్లలో సెర్చ్‌లు చేశారు.ముఖ్యంగా పృధ్విరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్‌ల ఇళ్ళు కూడా ఈ లిస్టులో ఉండటమే సంచలనమైంది. లగ్జరీ కార్లపై క్రేజ్ ఉన్న దుల్కర్ సల్మాన్ గ్యారేజీకి వెళ్లిన అధికారులు నేరుగా రెండు కార్లను సీజ్ చేశారు.

దుల్కర్ దగ్గర ఉన్న ల్యాండ్ రోవర్ డిఫెండర్, టయోటా ప్రాడో కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవి తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో నడుస్తున్నాయి. అంతేకాదు, ఈ వాహనాలపై ధర్డ్ పార్టీ ఓనర్ హక్కులు దుల్కర్ దగ్గర ఉన్నాయట.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) లగ్జరీ కార్ల టాక్స్ ఎవేషన్ రాకెట్‌పై విస్తృత దర్యాప్తు చేస్తోంది. భూటాన్ నుండి ఇంపోర్ట్ చేసిన కార్లు నేరుగా హిమాచల్ ప్రదేశ్‌లో రిజిస్టర్ చేసి, ఇతర రాష్ట్రాలకు షిఫ్ట్ చేస్తున్న మోసం బయటపడింది. ఈ క్రమంలోనే కొచ్చిలోని దుల్కర్ నివాసంకి కూడా అధికారులు దూసుకెళ్లారు.

ఒక్క దుల్కర్ మాత్రమే కాదు… కేరళలో మొత్తం 36 లగ్జరీ వాహనాలు నిన్న సీజ్ అయ్యాయి. హీరో అమిత్ చక్కలక్కల్ దగ్గర ఏకంగా 6 కార్లు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అంచనా వేసింది ఏమిటంటే – కేవలం కేరళలోనే 150-200 లగ్జరీ వాహనాలు ఈ రాకెట్‌లో ఉన్నాయట.

స్టార్ హీరోల కార్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఈ రాకెట్‌పై ఇంకా ఎన్ని షాకింగ్ రివలేషన్స్ వస్తాయో చూడాలి!

, , , ,
You may also like
Latest Posts from