‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లిపోయిన అవికా గోర్… ఇప్పుడు నిజంగానే పెళ్లి కూతురయ్యింది! బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించిన అవికా, ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చంద్వానీని చివరికి వివాహం చేసుకుంది.


ఎరుపు లెహంగా – పీచ్ షేర్వానీ కాంబోలో జంట దివ్యంగా మెరిసింది

పెళ్లి రోజు అవికా ఎరుపు రంగు లెహంగా ధరించగా, మిలింద్ పీచ్ షేర్వానీలో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. ఇద్దరూ కెమెరాల ముందు పోజులిచ్చి ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు.


‘పతీ పత్నీ ఔర్ పంగా’ షోలో ప్రత్యేక పెళ్లి

ఈ పెళ్లి ఒక రియాలిటీ షోలో జరగడం విశేషం. ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


సెలబ్రిటీ గ్లామర్

హీనా ఖాన్, రుబీనా దిలైక్, స్వర భాస్కర్, మునావర్ ఫరూఖీ, ఇషా మాల్వీయా, గుర్మీత్ చౌదరి వంటి పలువురు స్టార్‌లు హాజరై జంటను ఆశీర్వదించారు.


మెహెందీ నుంచి మిఠాయిల వరకు

అవికా తన మెహెందీ డిజైన్‌లను గర్వంగా చూపించగా, పెళ్లి తర్వాత మిలింద్‌తో కలిసి మీడియా ముందు స్వీట్లు పంచుతూ ఆనందాన్ని పంచుకుంది.


సోషల్ మీడియాలో వైరల్

ఫోటోలు, వీడియోల ద్వారా వీరి ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు అవికా–మిలింద్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ఇనిస్ట్రా పోస్ట్

అవికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో, “ఇది నిజమైన ప్రేమ. మిమ్మల్ని అందరినీ కలిపి చూసుకోవాలని ఉంది. నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తితో జీవితం మొదలుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.

సీరియల్‌ నటిగా కెరీర్‌ మొదలుపెట్టిన అవికా.. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆమె తొలి తెలుగు చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’ (2013)తో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మామ’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’, ‘థ్యాంక్యూ’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ‘షణ్ముఖ్’ అనే తెలుగు చిత్రంలో అవికా నటిస్తున్నారు.

ఈ పెళ్లి ఫొటోలు ఒక్కసారి చూసినవారిని మళ్లీ మళ్లీ స్క్రోల్ చేయించేలా ఉన్నాయి. నిజంగా అవికా – మిలింద్ జంట వావ్ అనిపించేలా మెరిసింది!

, , , , ,
You may also like
Latest Posts from