కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ వివాదానికి తాజాగా సుప్రీంకోర్టులో కీలక విజయం లభించింది. కన్నడ భాషపై కమల్ చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదమవడంతో, కర్ణాటకలో ఈ సినిమాపై నిరసనలు చెలరేగాయి. కొందరు సినిమాను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. థియేటర్లను తగలబెడతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీంతో సినిమాను కర్ణాటకలో విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిణామాలపై స్పందించిన చిత్ర టీమ్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, నేడు (జూన్ 17) కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

సినిమా రన్‌ను ఎవరూ అడ్డుకోలేరు – సుప్రీం హెచ్చరికలు!

‘‘ఒక వ్యక్తి వ్యాఖ్యలపై అభిప్రాయం తెలపవచ్చు. అయితే థియేటర్లు తగలబెడతామని బెదిరించడం పూర్తిగా చట్ట విరుద్ధం,’’ అని సుప్రీం కోర్టు హెచ్చరించింది.

‘‘థియేటర్లలో ఏ సినిమా ప్రదర్శించాలన్నది నిర్ణయించేది ప్రజలు, కానీ బెదిరింపులు చేసే సంస్థలు కాదు,’’ అని గట్టిగా స్పష్టం చేసింది.

‘‘సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ లభించిన సినిమా విడుదల అవ్వాల్సిందే. దాన్ని చూడాలా వద్దా అనే ఫ్రీడమ్ పూర్తిగా ప్రేక్షకులది,’’ అని పేర్కొంది.

కర్ణాటక హైకోర్టుపై ప్రశ్నలు

కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని కర్ణాటక హైకోర్టు సూచించిన తీర్పును కూడా సుప్రీం ప్రశ్నించింది. ఈ కేసును కర్ణాటక హైకోర్టు నుండి తనకు బదిలీ చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందన ఇవ్వాలని ఆదేశించింది.

Bottom Line:
సినిమాల మీద అభిప్రాయం ఉండొచ్చు. కానీ బెదిరించడం, ప్రదర్శన ఆపడం మాత్రం చట్ట విరుద్ధం. – సుప్రీం కోర్టు

థగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ కచ్చితంగా జరుగుతుంది.

ఈ తీర్పుతో ‘థగ్ లైఫ్’ చిత్రబృందానికి ఊపిరి పీల్చే అవకాశం లభించింది.

ఇక కమల్ హాసన్ – మణిరత్నం ల కలయికలో వచ్చిన ఈ బిగ్ బడ్జెట్ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా కు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ మూట కట్టుకున్న సంగతి తెలిసిందే.

#Kamal Hassan, #Mani Ratnam, #Silambarasan, #Thug Life, #Trisha

By admin