‘మ్యాడ్‌’తో సూపర్ హిట్ కొట్టిన నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ తాజాగా దీని సీక్వెల్‌తో ఈ వారం థియేటర్స్ లో దిగిన విషయం తెలిసిందే. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (MAD Square) టైటిల్ తో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా మార్చి 28న విడుదలైంది. అయితే తొలి చిత్రంలా ఈ సీక్వెల్ లేదని, సెకండాఫ్ బాగో లేదని, క్రింజ్ కామెడీ అని టాక్ , రివ్యూలు వచ్చాయి. యావరేజ్ సినిమా అని అందరూ తేల్చారు. అయితేనేం కలెక్షన్స్ మాత్రం ఈ సినిమా ఇరగదీస్తోంది. ఓవర్సీస్‌లోనూ హవా చూపిస్తోంది.

ఇప్పటివరకూ ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ రూ.55 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు చిత్ర టీమ్ అధికారికంగా తెలిపింది (MAD Square Collections). చిన్న సినిమా మూడు రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లు సొంతం చేసుకున్నందుకు ఆనందంగా ఉందంటూ పోస్టర్‌ విడుదల చేసింది. అలాగే ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా హవా కొనసాగుతోంది. అక్కడ వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది.

‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square ) సినిమాకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.21.9 కోట్లు షేర్ ను రాబట్టింది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. రాబోయే రోజుల్లో మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

, , , ,
You may also like
Latest Posts from