
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
ఈ పీరియడికల్ విలేజ్ స్పోర్ట్స్ రివేంజ్ డ్రామాలో చరణ్ మాస్ అవతారంలో కనిపించనున్నాడు. పొడవాటి జుట్టు, మందపాటి గడ్డం, బలమైన శరీరాకృతితో, దుమ్ముతో నిండిన మైదానంలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని నిలబడ్డ చరణ్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్‌గా జాన్వీ కపూర్, అలాగే కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మొదటగా ‘పెద్ది’ను మార్చి 27, 2026 (చరణ్ బర్త్‌డే) రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం, టీమ్ రిలీజ్ డేట్‌ను ఒక రోజు ముందుకు — మార్చి 26, 2026కి మార్చింది. కారణం — అదే రోజు శ్రీరామనవమి పండుగ, అటు ఫెస్టివల్ హాలీడే, ఇటు నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ బెనిఫిట్!
డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపినట్లుగా షూట్ ఇప్పటికే 60% పూర్తయింది, ఇక నవంబర్ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్, ఫస్ట్ సింగిల్ నవంబర్ ఫస్ట్ వీక్‌లోనే రిలీజ్ కానుంది.
ఫెస్టివల్ రిలీజ్ + చరణ్ మాస్ మేనియా = ‘పెద్ది’ బాక్సాఫీస్ స్టార్మ్ కన్‌ఫర్మ్!
