సినిమా గాసిప్స్సినిమా వార్తలు

రజినీ –సాయి పల్లవి కాంబో సెట్స్ పైకి? మైండ్ బ్లాక్ అయ్యే డిటేల్స్!

తమిళ సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రజినీకాంత్ కొత్త సినిమా తలైవర్ 173‌పై ఒక్కసారిగా హీట్ పెరిగింది. కమల్ హాసన్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ సెర్చ్ చాలాకాలంగా వార్తల్లో నిలిచింది. ఆ గందరగోళానికి పర్ఫెక్ట్ ఎండ్ పెట్టేస్తూ… ఇప్పుడు ఓ సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది!

సాయి పల్లవి – రజినీకాంత్ కాంబో కన్‌ఫర్మ్ అవుతోందా?

ఇండస్ట్రీ బజ్ ప్రకారం, నటిగా తన ప్రత్యేక ముద్ర వేసుకున్న సాయి పల్లవి, తలైవర్‌తో చేతులు కలపబోతున్నారని సమాచారం. అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో నెగోషియేషన్స్ నడుస్తున్నాయట. ఇది ఫైనల్ అయితే… ఇది ఆమె కెరీర్‌లో ఫస్ట్ రజినీ ఫిల్మ్!

సుందర్ C ఔట్… ‘పార్కింగ్’ డైరెక్టర్ ఇన్!

మొదట సుందర్ C ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సి ఉన్నా, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన వేరే దారి పట్టారు. తర్వాత పలువురు డైరెక్టర్లతో చర్చించిన రజినీ–కమల్ జంట, చివరికి ‘పార్కింగ్’ ఫేం రామ్ కుమార్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

రామ్ కుమార్ పూర్తి స్క్రిప్ట్‌ తో వెళ్లి రజినీని ఇంప్రెస్ చేశారట. ‘కూలీ’తో మాస్ మోడ్‌లో ఉన్న తలైవర్‌కి ఆయన నేరేషన్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు అన్న వార్తలు తమిళ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

డిసెంబర్ 12—తలైవర్ బర్త్‌డే స్పెషల్ అనౌన్స్‌మెంట్?

అధికారిక ప్రకటనను రజినీకాంత్ బర్త్‌డే రోజునే ప్లాన్ చేస్తున్నారని టాక్. షూటింగ్ మార్చి 2026లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

ప్రీ-ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్‌లో!

రామ్ కుమార్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ మొదలుపెట్టి, నటీనటులు–టెక్నికల్ టీం ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Similar Posts