ఇప్పుడు తెలుగు లో క్రేజీగా అతి పెద్ద ప్రాజెక్టు ఏదీ అంటే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అని చెప్తారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ఎక్సపెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన నీల్, ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలసి మరింత హై లెవెల్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా మామూలుగా ఉండదనేది నిజం. ప్రేక్షకులను థియేటర్లలో కుదిపేసాలా సినిమాని రూపొందిస్తున్నారట. అయితే ఇంత భారీ చిత్రానికి బడ్జెంట్ ఎంత
ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించారు. ప్రాజెక్ట్ మొత్తం 400 కోట్ల రూపాయలతో తెరకెక్కుతోంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమా. యాక్షన్ ఎపిసోడ్స్, సెట్స్, విఎఫ్ఎక్స్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నారు.
నేపధ్యం ఇదీ
ఇక ఈ సినిమా గోల్డెన్ ట్రయాంగిల్ అనే ప్రమాదకరమైన మాఫియా ప్రాంతం నేపథ్యం చుట్టూ తిరుగుతుందని టాక్. ఈశాన్య మయన్మార్, వాయువ్య థాయ్‌లాండ్, ఉత్తర లావోస్‌లను కలుపుతూ ఏర్పడిన ఈ గోల్డెన్ ట్రయాంగిల్, 1950 ప్రాంతంలో నల్లమందు తయారీకి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
హెరాయిన్, ఓపియం లాంటి డ్రగ్స్ ఇక్కడే పండించి, ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే హబ్‌గా మారింది. ఆ దందా వెనుక ఉన్న గ్యాంగ్‌ల మధ్య ఎదిగిన ఓ హీరోగా తారక్ పాత్రను డిజైన్ చేశారట.