సినిమా గాసిప్స్సినిమా వార్తలు

“నాని కొత్త అడుగు… తమిళ డైరెక్టర్‌తో సీక్రెట్ మీటింగ్ – ఏం ప్లాన్?”

టాలీవుడ్ టియర్–2 హీరోలలో నేచురల్ స్టార్ నాని దూసుకుపోతున్న స్పీడు వేరే లెవెల్‌లో ఉంది. నాని మార్కెట్, ముఖ్యంగా నాన్–థియేట్రికల్ డీల్‌లు, ఇప్పుడు నిర్మాతలకు గ్యారంటీలా మారిపోయాయి. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైస్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు నాని. ఈ సినిమా 2026 ఫస్ట్ హాఫ్‌లో విడుదల కానుంది. దీని తర్వాత సుజీత్ డైరెక్షన్‌లో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా సెట్ అవుతోంది.

అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న బజ్ మాత్రం మరింత ఇంట్రస్టింగ్.

నాని… తమిళ సెన్సిబుల్ డైరెక్టర్ తో,ఎవరా డైరక్టర్?

‘96’, ‘సత్యం సుందరం’ లాంటి భావోద్వేగ సినిమాలతో తమిళ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రేం కుమార్‌తో నాని మీటింగ్ జరిగినట్టు తెలిసింది. ఇద్దరూ ఇటీవల ఒక ఐడియాను చర్చించుకొని, ఆ కాన్సెప్ట్ నానికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట.

నాని ‘సత్యం సుందరం’ సినిమాకు పెద్ద ఫ్యాన్ అనేది చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయమే. ఆ అభిమానమే ఈ కాంబినేషన్‌ను ఇంకా హైప్ చేస్తోంది.

కానీ వెంటనే కాంబినేషన్ రాదు… ఎందుకు?

అయితే నాని – ప్రేం కుమార్ కాంబినేషన్ త్వరగా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ తక్కువగా కనిపిస్తోంది.

నానికి ఇప్పటికే రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.

మరోవైపు ప్రేం కుమార్ కూడా విక్రమ్ తో పాటు మరికొన్ని తమిళ చిత్రాలకు కమిట్ అయ్యారు.

అందుకే ఈ కాంబో పై అధికారిక ప్రకటన మాత్రం కొంచెం టైం పడుతుంది.

ఏదైమైనా టాలీవుడ్ – కొలీవుడ్ కలయిక ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ తెస్తుంది. నాని – ప్రేం కుమార్ కాంబోైతే భావోద్వేగంతో పాటు కంటెంట్ రిచ్ సినిమా పక్కా అనిపిస్తోంది. త్వరలో అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ కాంబినేషన్ నిజం అయితే… 2026 తర్వాత నానికి మరో క్లాస్–ఎమోషనల్ హిట్ లైన్‌లో పెట్టేశాడని చెప్పొచ్చు!

Similar Posts