అవీ ఇవీసినిమా వార్తలు

గీతా మాధురి భర్తగా అవమానాలు.. స్టార్ డైరెక్టర్లు నన్ను తొక్కేశారు: నందు సంచలన ఆరోపణలు!

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఇక్కడ పీకేదేం లేదు.. ఇండస్ట్రీలో నన్ను దారుణంగా తొక్కేశారు! భార్య గీతా మాధురి సక్సెస్ చూసి కుళ్లుకుంటున్నారు.. నందు పెయిన్ ఫుల్ కామెంట్స్ వైరల్!

వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ నటుడు నందు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లవుతున్నా, ఇప్పటికీ ఒక సరైన బ్రేక్ కోసం ఆయన పోరాడుతూనే ఉన్నారు. సింగర్ గీతా మాధురి భర్తగా అందరికీ తెలిసినా, ఒక నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నట్లు తాజాగా ఆయన వెల్లడించారు. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో తన పేరు రావడం, ఇండస్ట్రీలో జరిగిన పాలిటిక్స్ తన కెరీర్‌ను ఎలా దెబ్బతీశాయో చెబుతూ నందు ఎమోషనల్ అయ్యారు.

డ్రగ్స్ కేసులో బలిపశువును చేశారు!

2017లో టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై నందు ఘాటుగా స్పందించారు. “ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని నాలాంటి వాళ్లనే టార్గెట్ చేస్తారు. ఇండస్ట్రీలో మేకపోతుల్లా కొంతమందికి దొరికిపోతాం. వాడు ఏం పీకగలడులే అనే ధీమాతోనే నన్ను ఆ కేసులోకి అనవసరంగా లాగారు. ఆ సమయంలో నేను, గీత అంతా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏదైనా హోటల్‌లో పని చేసుకుందాం అనుకున్నాం” అంటూ తన ఆవేదనను పంచుకున్నారు.

రాజమౌళిని అడగలేదు.. కానీ అవమానించారు!

తన భార్య గీతా మాధురి పెద్ద సింగర్ అయినప్పటికీ, తన కోసం రికమెండ్ చేయమని ఎప్పుడూ అడగలేదని నందు స్పష్టం చేశారు. రాజమౌళి, పూరీ జగన్నాథ్ వంటి దిగ్గజ దర్శకులతో ఆమెకు పరిచయాలు ఉన్నా, తన టాలెంట్ తోనే ఎదగాలని కోరుకున్నట్లు చెప్పారు. అయితే, ఒక పెద్ద బ్యానర్ లో హీరోగా ఆఫర్ వచ్చి షూటింగ్ కి వెళ్లేలోపు తనను తీసేసి వేరొకరిని పెట్టుకున్నారని, కనీసం తనకు ఫోన్ చేసి కూడా చెప్పలేదని వాపోయారు. ఆడియో ఫంక్షన్లకి వెళ్తే కనీసం ముందు వరుసలో కూడా కూర్చోనివ్వకుండా అవమానించారని నందు పేర్కొన్నారు.

ఫ్యామిలీలో కూడా చిన్నచూపే!

సొంత ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా తనను ఒక స్టార్‌వి కావని పొడిచి పొడిచి హింసిస్తుంటారని, కేవలం గీతా మాధురి వస్తుందనే తనను పిలుస్తారని బాధపడ్డారు. “ఇండస్ట్రీలో రెండే కులాలు ఉంటాయి.. ఒకటి డబ్బున్న కులం, రెండు డబ్బు లేని కులం” అంటూ నెపోటిజంపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం నందు చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను మరోసారి బయటపెట్టాయి.

Similar Posts