
రవితేజ మళ్లీ కిక్కో ‘కిక్’ అనబోతున్నాడా?
ఇటీవల వరుస పరాజయాలు ఎదురైనా, మాస్ మహారాజా రవతేజ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ ఫలితాలు ఏవైనా సరే, ఆయన మార్కెట్‌పై నమ్మకం తగ్గకపోవడం, వరుసగా కొత్త ప్రాజెక్టులు లైన్లోకి రావడం ఆశ్చర్యపరిచే విషయం. ఇదే ఊపులో, రవితేజ కెరీర్లో మరో కీలకమైన కాంబినేషన్ మళ్లీ చర్చకు వచ్చింది.
మాస్ మహారాజాకు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తో ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. వీరిద్దరి కలయికలో ‘ధమాకా’, ‘ఈగిల్’, ‘మిస్టర్ బచ్చన్’ వంటి చిత్రాలు వచ్చాయి. అయితే ‘మిస్టర్ బచ్చన్’ విషయంలో భారీ నష్టాలు ఎదురవ్వడం, ఆ సమయంలో విశ్వ ప్రసాద్ టీమ్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. అయినా, ఆ విభేదాలు గతం అయ్యాయి అన్నట్టుగా, ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు సురేంద్ర రెడ్డి రవితేజకు ఓ పవర్ఫుల్ ఐడియా వినిపించారట. ఈ కథకు మాస్ మహారాజా నుంచి సానుకూల స్పందన వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్స్ మీడియా ప్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనుండగా, కథను రచయిత వక్కంతం వంశీ అందిస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చే ఏడాది ఉండగా, షూటింగ్ మాత్రం 2026 రెండో భాగంలో ప్రారంభం కానుందనే సమాచారం టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వీళ్ల కాంబినేషన్ లో గతంలో కిక్, కిక్ 2 చిత్రాలు వచ్చి సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సారి అలాంటి చిత్రమైన క్యారక్టరైజేషన్ తో ఈ చిత్రం రూపొందే అవకాసం ఉందంటున్నారు.
ఇక రవితేజ ప్రస్తుత లైనప్ చూస్తే, బిజీ షెడ్యూల్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్లో ఉన్న ఆయన, ఆ చిత్రాన్ని 2026 సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ‘భర్త మహాసయులకు విజ్ఞప్తి’ సినిమా సంక్రాంతి 2026కు సిద్ధంగా ఉంది. మరోవైపు, దర్శకుడు వశిష్ఠతో కూడా ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మొత్తంగా చూస్తే, వరుస ప్లాఫ్లు వచ్చినా సరే, రవితేజ మీద ఇండస్ట్రీ నమ్మకం తగ్గలేదు. కొత్త కథలు, కొత్త కాంబినేషన్లు, మళ్లీ మాస్ ఫార్మ్‌లోకి రావాలనే పట్టుదల ఆయనను ముందుకు నడిపిస్తోంది. ఇప్పుడు సురేందర్ రెడ్డి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ నిజమైతే, మాస్ మహారాజా నుంచి మరో పవర్ఫుల్ కమ్‌బ్యాక్ చూడబోతున్నామా అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో బలంగా పెరుగుతోంది.
