టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ కి 45 ఏళ్ళు ఉన్నప్పటికి ఇంకా పెళ్లి చేసుకుండా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూండటంతో మీడియా ఎప్పుడూ ఈ పెళ్లి వార్తలపైనే దృష్టి పెడుతోంది. మరో ప్రక్క ప్రభాస్ ఫ్యామిలీతోపాటూ ఫ్యాన్స్ కూడా డార్లింగ్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించిన వార్త బయిటకు వచ్చింది.
ప్రభాస్ పెళ్లి ని ఉద్దేశించి ఆయన స్నేహితుడు, రామ్‌చరణ్ (Ram Charan)రీసెంట్ గా ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని బయిటపెట్టారు.
ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్‌చరణ్ నవ్వుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని గణపవరానికి చెందిన అమ్మాయిని అతడు పెళ్లి చేసుకోనున్నారని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటిదాకా ఎన్నిసార్లు పెళ్లి గురించి అడిగినా ప్రభాస్ మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను కానీ ఎప్పుడనేది మాత్రం చెప్పలేను అంటూ దాట వేస్తూ వచ్చారు.
ఆమధ్య కల్కి 2898AD మూవీ ఈవెంట్ లో కూడా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రావడంతో “నా లేడీ ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీయకూడదనుకుంటున్నానని, అందుకే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొకొను అంటూ టాపిక్ ని డైవర్ట్ చేసాడు.