
వీక్‌డేస్ క్రాష్: ‘అఖండ 2’ సోమవారం–మంగళవారం లెక్కలు షాక్
‘అఖండ 2’కి థియేటర్లలో ఫస్ట్ వీకెండ్‌తోనే భాక్సాఫీస్ దగ్గర అసంతృప్తి కనిపించింది. అయితే రికవరీ మోడ్ లో ఉంటుందని సర్ది చెప్పుకున్నారు. కానీ అసలు ఆందోళన కలిగిస్తోంది ఏమిటంటే… వీక్‌డేస్‌లో సినిమా పూర్తిగా జారిపోవడం . ఐదు రోజుల థియేటర్ రన్ పూర్తయ్యే సరికి, సోమవారం–మంగళవారం వసూళ్లు చూస్తే ట్రేడ్ వర్గాల్లో ఒకే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక్కడ నుంచి రికవరీ రావడం కష్టమేనా అనే ప్రశ్న బలంగా నిలుస్తోంది.
సాధారణంగా పెద్ద సినిమాలకు సోమవారం డ్రాప్ రావడం సహజం. కానీ మంగళవారం అదే స్థాయిలో హోల్డ్ చేస్తే, రెండో వీకెండ్‌కి కొంత స్టెబిలిటీ ఉంటుందన్న అంచనా ఏర్పడుతుంది. ‘అఖండ 2’ విషయంలో మాత్రం అది జరగలేదు. సోమవారం పడిపోయిన కలెక్షన్స్, మంగళవారం మరింత తగ్గడం సినిమాకు వీక్‌డేస్‌లో కనీస సపోర్ట్ కూడా లేదన్న సంకేతాన్ని ఇచ్చింది. అంటే ఇది తాత్కాలిక డ్రాప్ కాదు, స్పష్టమైన డౌన్‌వర్డ్ ట్రెండ్ అని ట్రేడ్ అర్థం చేసుకుంటోంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ 2’ డిసెంబర్ 12న విడుదలైంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేకపోవడం గమనార్హం. వారం రోజుల వాయిదా, థమన్ అందించిన సంగీతం ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వకపోవడం ప్రీ రిలీజ్ హైప్‌ని తీవ్రంగా దెబ్బతీసింది. టీజర్లు, ట్రైలర్లు కూడా సీక్వెల్‌కు ఉండాల్సిన స్థాయిలో ఉత్సాహాన్ని రేపలేకపోయాయి.
దీంతో ‘అఖండ 2’ థియేటర్లలోకి ఒక భారీ ఈవెంట్‌లా కాకుండా, సాధారణ విడుదలలా వచ్చేసింది. సాధారణంగా పెద్ద సీక్వెల్స్‌కు కనిపించే క్రేజ్, హడావిడి ఇక్కడ పూర్తిగా మిస్సయ్యింది. ఇటీవల ‘పుష్ప 2’ లాంటి సినిమాల దగ్గర కనిపించిన ఫ్రెన్జీతో పోలిస్తే, ‘అఖండ 2’కి వచ్చిన స్పందన చాలా మామూలుగా మారింది.
ఇదే సమయంలో, నెగటివ్ రివ్యూస్, బలహీనమైన వర్డ్ ఆఫ్ మౌత్ పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. ఫ్యాన్స్ ఓపెనింగ్ ఇచ్చినా, సాధారణ ప్రేక్షకులు సినిమా వైపు రావడంలో వెనకడుగు వేయడం వసూళ్లపై స్పష్టంగా ప్రభావం చూపించింది. ఇప్పుడు రెండో వీకెండ్‌లో అయినా గ్రోత్ వస్తుందా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే, ‘అఖండ 2’ బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పటివరకు ఇచ్చిన సంకేతాలు ఆశాజనకంగా లేవు. వీక్‌డేస్‌లో ఇలా భారీగా పడిపోవడం, ముందున్న రన్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే, ఈ సినిమా భారీ నష్టాల దిశగా వెళ్తోంది అన్న అభిప్రాయం ట్రేడ్‌లో బలపడుతోంది. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే… సెకండ్ వీకెండ్ ఏదైనా మలుపు తిప్పుతుందా, లేక ఈ కథ ఇక్కడితో ముగిసిపోతుందా అని.
