సినిమా గాసిప్స్సినిమా వార్తలు

అల్లు అర్జున్ – జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ ? డైరక్టర్ ఎవరంటే…

టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్లు కలిసి చేసిన సినిమాలు ఒకప్పుడు బాక్సాఫీస్‌ను ఊపేశాయి. ఆ తరువాత కాలంలో ఈ ట్రెండ్ కాస్త తగ్గినా, మళ్లీ దానికి ఊపిరి పోసింది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. ఆ సినిమా టాలీవుడ్‌ను మాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లడమే కాదు, ఆస్కార్ వరకూ చర్చ తీసుకెళ్లింది.

ఇప్పుడు అదే స్థాయిలో మరో భారీ మల్టీ స్టారర్ వస్తుందన్న వార్తలు ఇండస్ట్రీలో ఆసక్తి పెంచుతున్నాయి. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేయబోతున్నారన్న టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు వెండితెరపై కలిసి కనిపించని ఈ ఇద్దరి కాంబినేషన్ అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ స్పీడ్ పెరిగింది. దేవరతో పాన్ ఇండియాలో తన సత్తా చూపిన తారక్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో భారీ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాక దేవర 2తో పాటు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. ఈ సినిమాల రిజల్ట్స్ ఆధారంగానే ఆయన నెక్ట్స్ మూవ్స్ ఉండబోతున్నాయని టాక్.

అటు అల్లు అర్జున్ పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ హీరోగా మారాడు. పుష్ప 2తో రికార్డులు బద్దలు కొట్టిన బన్నీ, ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన షెడ్యూల్ పూర్తిగా ప్యాక్ అయ్యింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ మల్టీ స్టారర్ సాధ్యమేనా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుడిపై చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ పేరు ఈ ప్రాజెక్ట్‌కు ఎక్కువగా వినిపిస్తోంది. లోకేష్ ఇప్పటికే అల్లు అర్జున్‌కు ఓ కథ వినిపించాడని, అందులో జూనియర్ ఎన్టీఆర్ ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్తుందన్న ఆలోచనలో ఉన్నాడని టాక్.

ఇది ఇప్పటివరకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కానీ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ కనగరాజ్ అనే మూడు పేర్లు ఒకే ప్రాజెక్ట్‌లో వినిపించడమే అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేపుతోంది. ఇది నిజమైతే టాలీవుడ్ మల్టీ స్టారర్ చరిత్రలో మరో సంచలన అధ్యాయం మొదలవుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.

Similar Posts