బాక్సాఫీస్ దగ్గర బాబాయ్ పవన్ కళ్యాణ్ గర్జిస్తుంటే.. అల్లు అర్జున్ మాత్రం ఎక్కడో ఉన్న హిందీ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో ఉన్నప్పుడే.. రణవీర్ సింగ్ ‘ధురందర్ 2’ కి బన్నీ రివ్యూ ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్‌లో అతిపెద్ద దుమారానికి దారి తీసింది. అసలు బన్నీకి బాబాయ్ కంటే ఆ బాలీవుడ్ డైరెక్టరే ముఖ్యం అయ్యాడా? మెగా ఫ్యాన్స్ ఎందుకు బన్నీని టార్గెట్ చేస్తున్నారు? ఈ గొడవ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల మధ్య పోటీ తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురందర్ 2’ భారీ అడ్వాన్స్ బుకింగ్స్‌తో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇదే సమయంలో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంచనాలను అందుకోవడంలో తడబడుతోంది, ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు మిశ్రమ స్పందన రావడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది.
సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ అగ్నికి ఆజ్యం పోసింది. ‘ధురందర్ 2’ సినిమా సాంకేతికతను, రణవీర్ సింగ్ నటనను, ఆదిత్య ధర్ దర్శకత్వాన్ని బన్నీ ఆకాశానికి ఎత్తేస్తూ రివ్యూ ఇచ్చాడు. బాబాయ్ సినిమాను పట్టించుకోకుండా వేరే సినిమాను ప్రమోట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ విపరీతంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్‌కు మద్దతు కావాల్సిన ప్రతిసారి బన్నీ ప్రత్యర్థి వర్గాలకే సపోర్ట్ చేస్తాడంటూ నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు.

ఈ వివాదం వెనుక మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. గతంలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘అశ్వత్థామ’ అనే సినిమా చేయాల్సి ఉంది, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినా.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. బన్నీ ఆ డైరెక్టర్‌ను పొగడటం వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా అని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ‘ధురందర్ 2’ మేనియాలో బన్నీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కు టార్గెట్ అయిపోయాడు.
Just Watched #Dhurandhar2⁰Patriotism with swag 🇮🇳
— Allu Arjun (@alluarjun) March 18, 2026
A film that will make every patriot proud 🇮🇳⁰Many clap-trapping moments 👏🏽
BLAST! 💥
Congratulations to the entire team.⁰Fine performances by @ActorMadhavan garu & all actors . Technical brilliance .
So proud to have a…
సినిమాల క్లాష్ పక్కన పెడితే.. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ ట్రోలింగ్‌పై ఐకాన్ స్టార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

