
‘అనగనగా ఒక రాజు’ వెనుక షాకింగ్ సీక్రెట్.. ఆ స్టార్ హీరో చెయ్యాల్సిన కధా ఇది?
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ‘రాజు’ గారి రచ్చ మామూలుగా లేదు. జాతిరత్నం నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి, నవీన్ కెరీర్‌లో హ్యాట్రిక్ తర్వాత మరో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే, ఈ సినిమా సక్సెస్ వెనుక ఒక షాకింగ్ సీక్రెట్ ఇప్పుడు బయటపడింది.
ముందుగా రౌడీ హీరో దగ్గరికి కథ?
ఈ సినిమా కథ మొదట నవీన్ పోలిశెట్టి కోసం రాసింది కాదట! ‘మ్యాడ్’ ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఈ స్క్రిప్ట్‌ను మొదట విజయ్ దేవరకొండతో చేయాలని అనుకున్నారట. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ కథ విజయ్ వరకు వెళ్లలేదు.
ఒకవేళ విజయ్ ఈ సినిమా చేసి ఉంటే కచ్చితంగా దెబ్బ పడేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులోని కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ కేవలం నవీన్ బాడీ లాంగ్వేజ్‌కు మాత్రమే సెట్ అవుతాయని, విజయ్ స్టైల్‌కు ఇది సూట్ అయ్యేది కాదని విశ్లేషకులు అంటున్నారు.
నవీన్ పోలిశెట్టి ‘మ్యాజిక్’.. సినిమాను లేపింది!
ఈ సినిమా సెకండ్ హాఫ్ కాస్త వీక్‌గా ఉన్నా, కేవలం నవీన్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టేశాడని అందరూ ఇప్పుడు అంటున్నారు. నవీన్ పోలిశెట్టి యాక్సిడెంట్ తర్వాత ఏడాది పాటు రెస్ట్ తీసుకున్న సమయంలో, ‘మారీ’ అనే డైరెక్టర్‌తో కలిసి తన సొంత ఐడియాస్ జోడించి స్క్రిప్ట్‌ను డెవలప్ చేశాడు.
వసూళ్ల సునామీ:
నాలుగు రోజుల్లోనే సేఫ్ జోన్ లోకి వచ్చిన ఈ సినిమా, లాంగ్ రన్‌లో రూ. 40 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
