సినిమా వార్తలు

సంక్రాంతి 2027 బుక్ అయిపోయింది.. అనిల్ రావిపూడి నెక్స్ట్ హీరో ఎవరంటే…?

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రస్తుతం తన తాజా బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని పక్కా వింటేజ్ స్టైల్‌లో చూపించి మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన అనిల్, ఇప్పుడు మరో మెగా హీరో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ ఊహాగానాలపై అనిల్ రావిపూడి పెదవి విప్పారు.

పవన్ కళ్యాణ్‌తో సినిమా.. నిజమెంత?

చిరంజీవి కామెడీ టైమింగ్‌ను అనిల్ వాడుకున్న తీరు చూసి, పవన్ కళ్యాణ్‌లోని ‘వింటేజ్ మాస్’ యాంగిల్‌ను కూడా అనిల్ బయటకు తీస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఆశపడ్డారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని ప్రచారం జరిగింది. కానీ, అనిల్ రావిపూడి దీనిపై స్పందిస్తూ కొన్ని కీలక విషయాలు చెప్పారు

“నేను ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ఆయనతో సినిమా చేయాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది” అని అనిల్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా చాలా బాధ్యతలతో బిజీగా ఉన్నారని, ఆయన ఇప్పుడు రెగ్యులర్ గా సినిమాలు చేసే స్థితిలో లేరని అనిల్ పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఎలాంటి ప్లాన్ లేదని, ఒకవేళ భవిష్యత్తులో కాంబినేషన్ కుదిరితే మాత్రం చాలా సంతోషిస్తానని అనిల్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా సంగతి పక్కన పెడితే, అనిల్ రావిపూడి తన 10వ సినిమా గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. తన తదుపరి సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంటుందని, ప్రకటించగానే అందరూ షాక్ అవుతారని హింట్ ఇచ్చారు.

ఏ హీరోతో అన్నది ఇంకా కన్ఫర్మ్ చేయకపోయినా, 2027 సంక్రాంతి బరిలో మాత్రం తన సినిమా ఖచ్చితంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Similar Posts