యూనిక్ కాన్సెప్ట్‌లతో కథలను ఎంచుకునే విష్ణు విశాల్ — ‘రాక్షసన్’, ‘ఎఫ్‌.ఐ.ఆర్.’, ‘మట్టికుస్తీ’ లాంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఆయన కొత్త క్రైమ్ థ్రిల్లర్‌ ‘ఆర్యన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సెల్వ రాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.

నిజానికి ఈ సినిమా గత వారం రాబోవాల్సి ఉంది, కానీ ‘మాస్ జాతర’ మరియు ‘బాహుబలి: ది ఎపిక్’ రాకతో వాయిదా పడింది. తమిళంలో మాత్రం ఇప్పటికే విడుదలైపోయింది. కానీ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో ఒక్కసారిగా హల్‌చల్‌! ప్రేక్షకులు క్లైమాక్స్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

విలన్ పాత్రలో నటించిన సెల్వ రాఘవన్ చివరి సన్నివేశంలో నలుగురిని ఎందుకు చంపాడనే అంశం తార్కికంగా సెట్ కాలేదని కామెంట్లు వెల్లువెత్తాయి. స్క్రీన్‌ప్లేలో ఆ సీన్ సరిపోలలేదని విమర్శలు వచ్చాయి.

దీంతో ‘ఆర్యన్’ టీమ్ వెంటనే యాక్షన్‌లోకి దిగింది! నిర్మాతలు కొత్త నిర్ణయం తీసుకుని, ఆ క్లైమాక్స్ సీక్వెన్స్‌లోని చివరి 10 నిమిషాల సన్నివేశాలను కట్‌ చేశారు. కొత్త వెర్షన్‌ను సోమవారం నుంచే థియేటర్లలో చూపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తెలుగు వెర్షన్‌ విషయానికి వస్తే – క్రిటిక్స్ సూచనల ఆధారంగా ఎడిటింగ్‌తో పాటు క్లైమాక్స్‌ని పూర్తిగా మార్చేశారు! ఈ కొత్త వెర్షన్ నవంబర్‌ 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ఎలా ఉన్నా, క్లైమాక్స్ సినిమాకి గుండెకాయ. చివరి ఇంపాక్ట్‌ బలంగా ఉంటేనే ఆడియన్స్ పాజిటివ్‌గా బయటికివెళ్తారు. మరి ఈ క్లైమాక్స్ మార్పు ‘ఆర్యన్’ తెలుగు వెర్షన్‌కు మలుపు తిప్పుతుందా..? అనేది చూడాలి.

సంగీతం గిబ్రాన్, దర్శకత్వం కె. ప్రవీణ్, నిర్మాణం స్వయంగా విష్ణు విశాల్ ప్రొడక్షన్స్.

, , , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com