నటుడు రజనీకాంత్( Rajinikanth) హీరోగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు వసంత్ రవి,రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ముఖయ పాత్రలు పోషించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాప్ తదితర స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిన ఈ చిత్రంలో నటి తమన్న ఐటమ్ సాంగ్‌లో నటించారు. 2023లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో తాజాగా జైలర్– 2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర షూటింగ్ పలు ప్రదేశాలో జరుపుకుంది. చివరిగా గోవాలో చిత్రీకరణను జరుపుకుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. ‘జైలర్’ లో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మొదట నుంచే ఒక సర్ప్రైజ్ ప్లాన్ పెట్టుకున్నాడట. మోహన్‌లాల్, శివరాజ్కుమార్లతో పాటు నందమూరి బాలకృష్ణ కూడా స్పెషల్ కేమియోగా కనిపించాలనుకున్నారు. ఇందుకోసం ఆంధ్రా పోలీస్ ఆఫీసర్‌గా ఒక పాత్ర కూడా డిజైన్ చేశారట. కానీ చివరికి ఆ ఐడియా అక్కడే ఆగిపోయింది.
ఇప్పుడు ‘జైలర్ 2’ లో మాత్రం బాలయ్య కోసం మరింత పెద్ద పాత్ర రాసారని టాక్. అయితే తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం — బాలయ్య స్క్రిప్ట్ విన్నాక తన రోల్ లెంగ్త్, ఆఫర్ చేసిన పారితోషికం చూసి ‘నో’ చెప్పాడట.
కొంతమంది ఇండస్ట్రీ సర్కిల్స్ చెబుతున్నదేమిటంటే, ఈ నిర్ణయానికి అసలు కారణం రేమ్యూనరేషన్ ఇష్యూనే. కానీ మరికొందరు మాత్రం “రజినీతో బాలయ్య బాండింగ్ చూసిన తర్వాత డబ్బు కోసం ఆ పాత్ర వదిలేస్తాడా?” అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ‘జైలర్ 2’ షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రాబోతున్నాయట.

