హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న AMB Cinemas ప్రస్తుతం నగరంలో అత్యుత్తమ మల్టీప్లెక్స్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సినీ ప్రియులు వరకూ అందరికీ ఇది ఫస్ట్ ఛాయిస్. మహేష్ బాబు,ఏసియన్ సునీల్ భాగస్వామ్యంగా ప్రారంభించిన ఈ మల్టీప్లెక్స్, నాణ్యతతో పాటు లాభాల పరంగా కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఈ విజయాన్ని బేస్‌గా చేసుకొని ఇప్పుడు AMB Cinemas దేశవ్యాప్తంగా విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది.
⭐ నాలుగు కొత్త నగరాల్లో నిర్మాణానికి శ్రీకారం:
మీడియా వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు, గోవా, బెంగళూరు, చెన్నై సహా మరో నగరంలో AMB Cinemas కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్థలాలు ఫైనలైజ్ అయ్యాయి, నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇంకా ఒక నగరంలో చర్చలు సాగుతున్నట్లు ఆసియన్ సునీల్ తెలిపారు.
స్టార్ హీరోలతో కలిసి కొత్త ట్రెండ్ సెటింగ్:
విశాఖపట్నంలోని ఇన్ఔర్బిట్ మాల్లో అల్లు అర్జున్‌తో కలిసి AAA Cinemas నిర్మాణంలో ఉంది.
రవితేజ భాగస్వామ్యంతో ART Cinemas అనే మల్టీప్లెక్స్ జులైలో ప్రారంభమవుతుంది.
వెంకటేష్ & మహేష్ బాబు కలిసి హైదరాబాద్ RTC క్రాస్ రోడ్డులో నాలుగు స్క్రీన్ల మల్టీప్లెక్స్ ఏర్పాటవుతుంది.
విజయ్ దేవరకొండతో కలిసి AVD Cinemas ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో ప్రారంభమైంది.
ఏసియన్ సునీల్ సినిమాల వ్యాపారంలో కొత్త కోణం తెరిచారు:
ఓ సాధారణ డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి దేశవ్యాప్తంగా స్టార్ హీరోలతో భాగస్వామ్యం చేసే స్థాయికి ఎదిగిన ఏసియన్ సునీల్, మల్టీప్లెక్స్ వ్యాపారానికి కొత్త దిశను చూపించారు. ఖచ్చితమైన నిర్వహణ, బ్రాండ్ విలువలు, స్టార్ కలాబొరేషన్స్తో పాటు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న వ్యాపార ప్రణాళిక ఆయన ప్రత్యేకతగా మారింది.
ఇక AMB Cinemas గ్లోబల్ ప్రెజెన్స్ వైపు అడుగులు వేయడం కేవలం టైమ్ మేటర్ మాత్రమే అనిపిస్తోంది!