టాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై సెప్టెంబర్ 25న మాస్‌ సినిమాల వర్షం కురిసేలా ఉంది! ఒకవైపు పవన్ కళ్యాణ్ ‘OG’, మరోవైపు నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’. ఈ రెండు భారీ సినిమాలు ఒక్కే రోజున విడుదలకు సిద్ధమవుతున్నట్టు వార్తలు రావడంతో ట్రేడ్ లో ఓ రకమైన క్యూరియాసిటీ పెరిగింది.

‘అఖండ 2’ విడుదల తేదీగా సెప్టెంబర్ 25ని ప్రకటించగా, కొద్ది రోజులకే ‘OG’ టీమ్ కూడా అదే తేదీని లాక్ చేసారు. దీంతో, ఈ రెండూ భాక్సాఫీస్ దగ్గర తలపడే పరిస్థితి ఏర్పడింది. టాలీవుడ్ వర్గాల్లో మొదట ‘అఖండ 2’ డిసెంబరుకి వాయిదా పడనుందనే ఊహాగానాలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, అఖండ 2 టీమ్ డేట్‌ మార్చే ఉద్దేశ్యమే లేకుండా సెప్టెంబర్ 25నే నిలబెట్టేందుకు పట్టుదలగా ఉందని తెలుస్తోంది.

ఇక బాలకృష్ణ పుట్టినరోజున (జూన్ 10) రిలీజ్ అయ్యే టీజర్‌ ద్వారా ఈ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే… ‘OG’ టీమ్‌తో మాట్లాడకుండానే ‘అఖండ 2’ టీమ్ తమ ప్లాన్ కొనసాగిస్తోందన్న మాట.

అయితే, ఇదొక డేంజరస్ క్లాష్ అనే చెప్పాలి. ఎందుకంటే, ‘OG’పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాగా కాకుండా, నెయిటివ్ షేడ్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న OG క్రేజ్‌ను తట్టుకోవడం సులభం కాదు. అలాంటప్పుడు ‘అఖండ 2’ లాంటి సీక్వెల్ మూవీకి ఖచ్చితంగా వ్యూహాత్మకమైన రిలీజ్ డేట్ అవసరం.

బాలయ్య మాస్ మేజిక్, పవన్ OG ఫైర్… ఈ క్లాష్ నిజమైతే సెప్టెంబర్ 25న టికెట్ కౌంటర్ల దగ్గర దుమ్మురేగే పోటీ ఖాయం!

, , , , ,
You may also like
Latest Posts from