సినిమా వార్తలు

బాలయ్య మాస్ ఫీవర్ స్టార్ట్ – ‘అఖండ 2’ ప్రీమియర్స్ ప్లాన్ చూసి ట్రేడ్ షాక్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి దృష్టి ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ ఏదంటే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ సినిమా. ఇప్పటికే ఈ సినిమా చుట్టూ ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది. ఫ్యాన్స్ మధ్యా, ట్రేడ్ సర్కిల్స్‌లోనూ “అఖండం” మళ్లీ మొదలవుతోంది! అనే మూడ్ స్పష్టంగా కనిపిస్తోంది.

వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వరుసగా బ్లాక్‌బస్టర్లు కావడంతో, ఈ సీక్వెల్‌కి బిజినెస్ ఆఫర్లు ఆకాశాన్నంటాయి.

డిజిటల్ రైట్స్ – ₹85 కోట్లు (Jio Plus Hotstar)

శాటిలైట్ రైట్స్ – ₹60 కోట్లు

సీడెడ్ రైట్స్ – ₹24 కోట్లు

ఓవర్‌సీస్ రైట్స్ – ₹15 కోట్లు
అంటే రిలీజ్‌కి ముందే ప్రొడ్యూసర్లు భారీ లాభాల్లో ఉన్నారు.

ఇప్పుడు ఈ హైప్‌ను మరింత పెంచే మరో సెన్సేషన్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘అఖండ 2’కి ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు!

ఇటీవలి కాలంలో తెలుగు బిగ్ ఫిల్మ్స్ రిలీజ్‌కు ముందు రాత్రే ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించడం ట్రెండ్‌గా మారింది. అదే స్టైల్లో, బాలయ్య సినిమా కూడా డిసెంబర్ 4వ తేదీ రాత్రి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు జరగనున్నాయి.

ఇది బోయపాటి శ్రీను తీసుకున్న పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే, బాలయ్య సినిమాల ప్రధాన ప్రేక్షక వర్గం డొమెస్టిక్ మాస్ ఆడియెన్స్. వారి నుంచే వచ్చే ఫస్ట్ రియాక్షన్, రివ్యూస్, వర్డ్ ఆఫ్ మౌత్ సినిమాకి మాస్ రాంపేజ్ తీసుకువస్తాయని నమ్మకం.

మరి ఈసారి ‘అఖండ 2’ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతూ, థియేటర్‌లలో తాండవం మొదలు పెట్టబోతుంది! ఇంకా, నవంబర్ 14న ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. దాంతో ఫుల్ ఫ్లెడ్జ్ ప్రమోషన్స్‌కి టీమ్ సిద్ధమవుతోంది.

డిసెంబర్ 5న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను కుదిపేయడం ఖాయమని అభిమానులు ధీమాగా చెబుతున్నారు.

Similar Posts