సినిమా వార్తలు

బాలకృష్ణ కుమారుడు ఎంట్రీకి ముహూర్తం ఖరారు? మోక్షజ్ఞ సినిమాకు డైరెక్టర్ లాక్!?!

చాలా కాలంగా నందమూరి అభిమానులను ఊరిస్తున్న విషయం ఒక్కటే – మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో వారసుడిని వెండితెరపై చూస్తామా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. గత రెండేళ్లుగా మోక్షజ్ఞ డెబ్యూపై రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాదే ఎంట్రీ ఉంటుందని అనుకున్న సమయంలో… మోక్షజ్ఞ న్యూ లుక్స్ బయటకు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ అనుకోని కారణాలతో ప్రాజెక్ట్ ఆగిపోవడంతో మళ్లీ నిరాశే మిగిలింది.

కొత్త ఏడాదిలో మోక్షజ్ఞ సినిమాకు గ్రీన్ సిగ్నల్?

ఇప్పటికే ఒకసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ అని ప్రకటించినా… ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లలేదు. లుక్ మాత్రం భారీగా ఇంప్రెస్ చేసింది. కంప్లీట్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో మోక్షజ్ఞ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. అయితే తాజా సమాచారం ప్రకారం… బాలయ్య తన కుమారుడి ఎంట్రీ కోసం కొత్త ప్లాన్ రెడీ చేశారట.

2026 న్యూ ఇయర్ రోజున సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని,
2026 చివర్లో రిలీజ్ చేసేలా మాస్టర్ ప్లాన్ వేసినట్టు ఇండస్ట్రీ టాక్.

డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకుడు ఎవరు అన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్. టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న హాట్ టాక్ ప్రకారం… బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండొచ్చు అని ప్రచారం జరుగుతోంది.

బాలకృష్ణకు వరుసగా బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన దర్శకుడిగా బోయపాటికి నందమూరి అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇప్పటికే బాలయ్యతో నాలుగు భారీ హిట్లు అందించిన ఆయన చేతుల్లోనే మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యతలు పెట్టారన్న మాట వినిపిస్తోంది. ఈ సినిమాను లవ్ స్టోరీ + భారీ ఎమోషన్స్ + పవర్‌ఫుల్ ఎలివేషన్స్తో సెట్ చేస్తున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బాలకృష్ణ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ? మరో ట్విస్ట్!

ఇదిలా ఉంటే… మరో ఆసక్తికరమైన టాక్ కూడా నెట్టింట హల్‌చల్ చేస్తోంది. బాలకృష్ణ స్వయంగా డైరెక్ట్ చేసే ‘ఆదిత్య 369’ సీక్వెల్‌నే మోక్షజ్ఞ డెబ్యూ అవుతుందా?, ఆదిత్య 369 సీక్వెల్ వస్తుందన్నది నిజమే అని బాలయ్య ఇప్పటికే చెప్పిన విషయం. కానీ అందులో మోక్షజ్ఞ నటిస్తారా లేదా అన్న క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. అదే నిజమైతే… అది నందమూరి అభిమానులకు పండగే.

మొత్తానికి… వెయిటింగ్ గేమ్ ఇంకా కొనసాగుతోంది

ప్రస్తుతం అఖండ 2 హడావిడిలో ఉన్న బాలకృష్ణకు, ఆ సినిమా ఫలితం తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఒక విషయం మాత్రం క్లియర్ – మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులే కాదు… ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇక ఆ ఎదురుచూపులకు నిజంగా న్యూ ఇయర్‌లోనే మోక్షం దొరుకుతుందా? చూడాలి!

Similar Posts