
2026లో కేథరిన్ బ్లాస్ట్?
ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార… ఈ సినిమాలతో తెలుగు అభిమానులకి దగ్గరైన కేథరిన్ ట్రెసా… మళ్లీ బిజీగా మారిపోయింది! ఈసారి మాత్రం కెమెరా కంటే ముందుగా… డ్యాన్స్ ఫ్లోర్ మీద అడుగు వేయడానికి సిద్ధం!
స్పెషల్ సాంగ్ ఖరారు!
సందీప్ కిషన్ హీరోగా వస్తున్న యాక్షన్-అడ్వెంచర్ సినిమా ‘సిగ్మా’ చివరి దశలో ఉంది. ఇందులో కేథరిన్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు. సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే ఎనర్జీతో నిండిన బీట్ కంపోజ్ చేశారట! చూపులకి పండుగ అయ్యేలా… భారీగా కలర్‌ఫుల్ సెట్ వేసి షూట్ చేస్తున్నారు.
సూపర్‌హీరో ఫైట్స్ + గ్లామర్ సాంగ్
మేకర్స్ మాటల్లో…
సందీప్ కిషన్ పాత్ర సూపర్ హీరో రేంజ్ లో ఉంటుందట, ఫైట్స్ థ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయట. కేథరిన్‌తో ఈ సాంగ్ సిగ్మాకి హైలైట్. ఇక ఇది జాసన్ సంజయ్ డైరెక్టోరియల్ డెబ్యూ. అవునండి… ఇతనే తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు! ‘లైకా ప్రొడక్షన్స్’ ఈ సినిమా మీద ఫుల్ స్కేల్ గా వెచ్చిస్తోంది.
2026లో కేథరిన్ బ్లాస్ట్?
ఈ ఏడాది చివరికి కేథరిన్… చిరంజీవి సినిమా “మన శంకర వర ప్రసాద్ గారు” లో కూడా కనిపించబోతోంది. నయనతార హీరోయిన్… కేథరిన్ ప్రత్యేక పాత్ర. సిగ్మా, మనా శంకర వర ప్రసాద్ గారు… రెండు భారీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి.
మరి 2026లో కేథరిన్ కి ఆఫర్లు వరదలా వస్తాయా? ఈ స్పెషల్ సాంగ్… ఆమె కెరీర్ కి గేమ్‌చేంజరా? వేసవిలో ‘సిగ్మా’ వచ్చాక సమాధానం తెలుసుకుంటాం!
