సినిమా వార్తలు

చిరంజీవికు గాడ్‌ఫాదర్‌గా మోహన్‌లాల్?… కథ ఇక్కడే మలుపు తిరుగుతుందా?

చిరంజీవి వంటి మాస్ మేగాస్టార్, మోహన్‌లాల్ వంటి అద్భుతమైన ఆర్టిస్ట్ ఒకే సినిమాలో కలిస్తే తెరపై ఎలా ఉంటుంది అనే ఆలోచనే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇద్దరిదీ రెండు భిన్నమైన స్టైల్‌లు, కానీ స్క్రీన్ మీద పడితే ఒకదానికొకటి బలం ఇచ్చే స్థాయి. ఇప్పటివరకు ఊహగానే ఉన్న ఈ కాంబినేషన్ త్వరలో నిజం కాబోతోందన్న వార్తే సినీ వర్గాల్లో క్యూరియాసిటీని రెట్టింపు చేస్తోంది. లెజెండ్స్ కలిసి కనిపించే ఆ క్షణం కోసం అభిమానులు ఇప్పటికే ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఇదంతా ఏ సినిమా కోసం అంటారా….

‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న చిరంజీవి–బాబీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. మాస్ ఎంటర్‌టైనర్‌పై బాబీకి ఉన్న పట్టు, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి మళ్లీ అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తాయనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా వినిపిస్తున్న ఓ కీలక అప్‌డేట్ ఈ ప్రాజెక్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చుతోంది.

ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి పాత్రకు ‘గాడ్‌ఫాదర్’ లాంటి బలమైన క్యారెక్టర్‌లో మోహన్‌లాల్ కనిపిస్తారని సమాచారం. అంటే ఇది కేవలం క్యామియో కాదు, కథను మలుపు తిప్పే పవర్‌ఫుల్ రోల్ అన్న మాట. రెండు ఇండస్ట్రీల లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బజ్‌ను క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని టాక్.

ఇక చిరంజీవి లైనప్ చూస్తే, ముందుగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ‘విశ్వంభర’ మూవీ 2026 సమ్మర్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ రెండింటి తరువాత బాబీతో చేసే ఈ కొత్త సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ 2027 సంక్రాంతికి రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోహన్‌లాల్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. చిరంజీవి కెరీర్‌లో మరో భారీ మాస్ మోమెంట్‌గా ఇది నిలుస్తుందా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar Posts