మెగాస్టార్ చిరంజీవి – వశిష్ఠ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదైనా, ఇటీవల వరకూ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ విషయంలో కొంత స్థిరత లేకపోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ సమస్యకు క్లారిటీ వచ్చిందని సమాచారం.
ZEE – Prime Video డీల్ ఫైనల్!
తాజా సమాచారం ప్రకారం, శాటిలైట్ రైట్స్‌ను ZEE గ్రూప్ …డిజిటల్ (OTT) రైట్స్‌ను Prime Video సొంతం చేసుకున్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు చిత్రానికి ఓటీటీ బిజినెస్ సెటిల్ కాకపోవడంతో రిలీజ్ పై క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు ఆ హర్డిల్ పూర్తిగా క్లియర్ అయిందన్న టాక్.
సెప్టెంబర్ రిలీజ్ పక్కా?
ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ చివరి దశలో ఉంది. ఒక పాటతో పాటు కొన్ని మైనర్ టాకీ పార్ట్లు మిగిలి ఉన్నాయి. తదుపరి ప్లాన్ ప్రకారం, ఈ సినిమా సెప్టెంబర్‌లో థియేటర్లకు రావాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.
మరొక పక్క, పవన్ కళ్యాణ్ OG సినిమా రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత లేకపోవడంతో, అదే డేట్‌ను విశ్వంభర తీసుకునే అవకాశముందన్న గాసిప్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
చిరంజీవి – అనిల్ రావిపూడి మూవీకి సంక్రాంతి 2026 బుక్!
ఇదిలా ఉండగా, మెగాస్టార్ తదుపరి సినిమా — అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే సినిమా ఇప్పటికే సంక్రాంతి 2026 రిలీజ్‌కు లాక్ అయ్యింది. అందువల్ల విశ్వంభర సెప్టెంబర్‌లో రావాల్సిందే అన్నది మెగా క్యాంప్ అభిప్రాయం.