నాగార్జున (Nagarjuna), ధనుష్‌ (Dhanush), రష్మిక (Rashmika) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’ (Kuberaa). శేఖర్‌ కమ్ముల దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 20న (kuberaa release date) తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో రూ.75 (జీఎస్టీ అదనం) వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.

మరోవైపు తెలంగాణలో మాత్రం టికెట్‌ ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయమై చిత్ర టీమ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీప్లెక్స్‌, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో టికెట్‌ ధరలు యథాతథంగా ఉండనున్నాయి. ఈ టిక్కెట్ రేట్లు పెంచటం అనేది సినిమా కు శాపమా, వరమా అనేది ఓపినింగ్స్ ని బట్టి ఆధారపడుతుంది. కానీ ఓపినింగ్స్ అయితే బాగా స్లోగా ఉన్నాయి.

బడ్జెట్ సంగతి పక్కనపెడితే కుబేరకు డీసెంట్ హైప్ ఉంది తప్ప ఆర్ఆర్ఆర్, కల్కి రేంజ్ లో లేదు. కానీ ఇప్పుడీ పెంపు ప్రభావం ఓపెనింగ్స్ మీద పడే అవకాశం లేకపోలేదు. ఏరియాని బట్టి టికెట్ రేట్లు పెడతామని చెప్పిన నిర్మాత సునీల్ నారంగ్ అన్నట్టుగానే దాన్ని భాగ్యనగరంలో అమలుపరిచారు.

#Dhanush, #Kubera, #Nagarjuna, #Rashmika Mandanna, #Sekhar Kammula

By admin