రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘కూలీ’ (Coolie). ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో ఓవర్సీస్‌లో రికార్డు నమోదైంది.
విడుదలకు రెండు రోజుల ముందే ‘కూలీ’ రెండు మిలియన్ల క్లబ్‌లో చేరిపోయింది. ప్రీమియర్స్‌లోనే ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి తమిళ సినిమాగా రికార్డు నెలకొల్పింది (Coolie Record). 2016లో రజనీకాంత్ నటించిన ‘కబాలి’ నార్త్ అమెరికాలో విడుదలకు ముందే 60 వేల డాలర్లు వసూళ్లు చేసిన మొదటి తమిళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఆయన రికార్డును ఆయనే బ్రేక్ చేశారు. సూపర్‌స్టార్ రికార్డును బ్రేక్ చేయడం మళ్లీ ఆయనకే సాధ్యమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఒకప్పుడు ప్రజలు భయపడే మాజీ బంగారు స్మగ్లర్ అయిన దేవా ( రజనీకాంత్) నేతృత్వంలోని మాఫియా గ్యాంగ్ కథ ఇది.దేవా తన పాత గ్యాంగ్‌ను తిరిగి కలపడం ద్వారా పాత వైభవాన్ని తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అలాగే రజనీకాంత్, సత్యరాజ్ ఇద్దరూ స్నేహితులు. సత్యరాజ్ కూతురు శృతి హాసన్ (ప్రీతి రాజశేఖర్). సత్యరాజ్‌కి శత్రువల వల్ల ఏదో జరుగుతుంది. దీని కారణంగా ఆయనను కాపాడటానికో లేదా ఆయన కూతురి కోసమో రజనీకాంత్ వస్తాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలే సినిమా కథ అని తెలుస్తోంది.
సన్ పిక్చర్స్ నిర్మించింది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కూలీ’ లో నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, సౌబిన్‌షాహిర్, మహేంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా విడుదల చేసిన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ‘కూలీ’తో లోకేశ్ మరో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.