టాలీవుడ్ ఫైనాన్షియర్స్ ఇప్పుడు చాలా సినిమాలకు డబ్బులు పెట్టడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే అవి వెనక్కి రావటానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మార్కెట్ బాగోలేదు. కానీ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా “The Paradise” మాత్రం కార్పొరేట్ స్థాయిలో నిధుల్ని ఆకర్షిస్తూ, గ్రాండ్‌గా సెట్స్‌పైకి వెళ్తోంది.
ఇప్పటికే హైదరాబాదులో షూటింగ్ మొదలైన ఈ సినిమా భారీ బడ్జెట్ అవసరం ఉంది. ఈ సినిమా వదిలిన గ్లింప్స్‌తో ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అయ్యి… అనేక కార్పొరేట్ సంస్థలు దీన్ని పట్టాలెక్కించేందుకు ముందుకొస్తున్నట్లు సమాచారం.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..ఈ నేపథ్యంలో, ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం సారేగామా ఈ ప్రాజెక్ట్‌కు కో-ప్రొడ్యూసర్‌గా జాయిన్ అయ్యింది. ఇది వారి ప్రొడక్షన్ విభాగంలో మరో పెద్ద అడుగు అని చెప్పవచ్చు.
సినిమాకు పెట్టుబడి మాత్రమే కాదు, నాన్-థియేట్రికల్ డీల్స్‌లో వాటా కోసం కార్పొరేట్లు పోటీ పడుతుండటం. ఈ ప్రాజెక్ట్ మీద వారికి ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది.
ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంగీతానికి మాస్ & మాజికల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరాలందించనున్నాడు.
నాని ఈ నెల మధ్యలో సెట్స్‌లో జాయిన్ కానున్నాడు. ఇప్పటికే ఫ్యాన్స్‌కి ఈ సినిమాపై ఓ స్పష్టమైన విజువల్ వచ్చేసింది. ఇక గుర్తు పెట్టుకుని ఎదురుచూడాల్సిందే “The Paradise” విడుదల తేదీ: మార్చి 26, 2026! కోసం.