ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ఓటీటీలు ప్రభావం కొత్త చర్చలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో దశాబ్దాలుగా సినిమాలకు థియేటర్లే ఒకే మార్గంగా ఉంటూ వచ్చాయి. అయితే కొంతకాలం క్రితం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కొత్త తలుపులు తెరిచినప్పటికీ… ఇప్పుడు అదే తలుపు మూసేస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ CEO టెడ్ సరణ్డోస్ చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చ మరింత వేడెక్కింది.

భారత మార్కెట్లో ఒరిజినల్ కంటెంట్‌తో అడుగుపెట్టిన నెట్‌ఫ్లిక్స్‌కు ‘సాక్రెడ్ గేమ్స్’ అనే గ్రౌండ్ బ్రేకింగ్ సిరీస్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ సిరీస్ మీదే నెట్‌ఫ్లిక్స్ CEO చేసిన వ్యాఖ్యలు – ఆ సీరిస్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను కోపం తెచ్చి పెట్టాయి.

“Tech Guys Don’t Get Storytelling”: అనురాగ్ ఘాటుగా!

2018లో విడుదలైన ‘సాక్రెడ్ గేమ్స్’ — సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పంకజ్ త్రిపాఠి, రాధికా ఆప్టే, కల్కి కోచ్లిన్ లాంటి స్టెల్లర్ నటులతో ఓ నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‌కి విక్రమాదిత్య మోత్వానే, అనురాగ్ కశ్యప్ కలిసి దర్శకత్వం వహించారు. ఇది Netflix Indiaకే కాదు — మొత్తం OTT ఇండియన్ ల్యాండ్‌స్కేప్‌కే మైలు రాయిగా నిలిచింది. కానీ, ఈ లెజెండరీ సిరీస్ గురించి టెడ్ సరణ్డోస్ ఇటీవల ఈ సీరిస్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఓ పోడ్కాస్ట్‌లో టెడ్ మాట్లాడుతూ:

“సాక్రెడ్ గేమ్స్‌ లాంటి క్లిష్టమైన సిరీస్‌తో కాకుండా… అత్తా,కోడలు (సాసు–బహూ) తరహా సులువైన షోలతో ఇండియాలో అడుగుపెట్టాల్సింది. ప్రేక్షకులు అంత క్లిష్టతను అర్థం చేసుకోలేకపోయారు.”అన్నారు.

ఈ మాటలు దర్శకుడు అనురాగ్ కశ్యప్ లో కోపాన్ని తీసుకొచ్చాయి. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఇలా ఘాటుగా స్పందించారు:

“Tech వాళ్లు కథల పట్ల మూఢులు అన్న విషయం నాకు తెలుసు. కానీ టెడ్ సరణ్డోస్ మాత్రం ‘మూగ అనే పదానికి నిర్వచనం’ అని ఇప్పుడే తెలిసింది. అతను సాసు–బహూ షోలు తోనే ప్రారంభించాల్సింది. అప్పుడేమో బాగుండేది!”

అనురాగ్ విమర్శలు ఇంతటితో ఆగలేదు. గతంలో కూడా నెట్‌ఫ్లిక్స్ బాస్‌ల అవినీతిని గురించి ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగానే ఆరోపణలు చేశారు.

Sacred Games — Netflix Indiaలో ఓ యుగారంభం

నవాజుద్దీన్ సిద్ధిఖీ పోషించిన గణేష్ గైతొండే ఈ సిరీస్‌కు గుండె లాంటి పాత్ర. పోలీస్ ఆఫీసర్ సర్తాజ్ సింగ్ (సైఫ్ అలీ ఖాన్) అతని చుట్టూ అల్లుకున్న మిస్టరీని ఛేదించాలనుకుంటాడు. ఒక్కటంటే ఒక్కటే మాట – Sacred Games wasn’t just content. It was culture.

కానీ ఇప్పుడు అదే సంస్కృతిని విమర్శించడం, అంతటి మైలురాయిగా నిలిచిన సిరీస్‌ను ఖండించడం ఓ బిగ్ షాక్. ఈ సంఘటన ఓటీటీల ఆధిపత్యం కంటే కథలపై వ్యవస్థల అవగాహన లేకపోవటం, మార్కెటింగ్‌ డెసిషన్‌ల పేరిట కథను పక్కన పెట్టడం గురించి ఆలోచించాల్సిన డిస్కషన్ గా మారింది.

ఏదైమైనా ఒరిజినల్ కంటెంట్‌పై వేసిన మొదటి అంకురం Sacred Games. ఆ చెట్టు పండించి బాగా ఎదిగింది. కానీ ఇప్పుడు అదే చెట్టు ఏవిధంగా కత్తిరించబడుతుందో చూస్తూ ఉండాల్సిన పరిస్థితి. మళ్లీ అలాంటి డేర్ & డార్క్ కథల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ OTTలు మార్కెట్ పరంగా కాకుండా కథల పరంగా ముందడుగు వేయాలనుకుంటే – Sacred Games ఒక పాఠం అవుతుంది. లేకపోతే –ఆ స్కూలే మూతపడుతుంది.

,
You may also like
Latest Posts from