శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కలిసి ఒక పీరియాడికల్ డ్రామా కోసం చేతులు కలిపారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన “ఒడెలా 2” ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.
ఏప్రిల్ 17 న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో సంపత్ నంది తన రాబోయే చిత్రాల గురించి చాలా విషయాలు వెల్లడించారు. వాటిలో ఒకటైన శర్వాతో చేయబోయే సినిమా గురించి చెప్పుకొచ్చారు.
సంపత్ నంది మాట్లాడుతూ… ‘‘భవిష్యత్తులో శివుడిపై నేను మరో సినిమా చేస్తా. అది నేను నమ్మే సిద్ధాంతాలతో ఉంటుంది. ప్రస్తుతం నేను శర్వానంద్‌తో (Sharwanand) చేయనున్న సినిమా వాస్తవ సంఘటనలతో అల్లుకున్న కథగా ఉంటుంది. మహారాష్ట్ర – ఆదిలాబాద్ సరిహద్దుల్లో ఓ గ్రామం ఉంది. 1960ల్లో ఆ ప్రాంతంలో అక్కడ జరిగిన కొన్ని సంఘటనల్ని ఫిక్షన్‌గా మార్చి ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు.