నందమూరి అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ తేజ డెబ్యూ కి ఇంకా ముహూర్తం ఫిక్సవ్వలేదు. “ఇదిగో వస్తున్నాడు… అదిగో వస్తున్నాడు…” అంటూ వార్తలు వచ్చినా, వాస్తవానికి ఇప్పటి వరకు లాంచ్ కూడా జరగలేదు.
గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అధికారిక ప్రకటన ఇచ్చినా, పూజా కార్యక్రమాలు జరగకముందే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత బాలకృష్ణే తనయుడి తొలి సినిమాకు దర్శకత్వం వహిస్తానని ప్రకటించారు. కానీ ఆ ప్రణాళిక కూడా వాయిదా పడింది.
ఇక తాజాగా మోక్షజ్ఞ బరువు తగ్గి, స్లిమ్గా మారిన కొత్త ఫోటోలు బయటకొచ్చి అభిమానుల్లో మరోసారి హైప్ పెంచేశాయి. “ఇప్పుడు అయినా ఎంట్రీ వస్తుందా?” అన్న చర్చ మొదలైంది. అయితే పెద్ద ఎత్తున అప్డేట్ మాత్రం రాలేదు.
‘సుందరకాండ’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నారా రోహిత్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజా మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు. ”రీసెంట్ గా మోక్షజ్ఞతో మాట్లాడినప్పుడు స్క్రిప్ట్ కోసం చూస్తున్నానని చెప్పాడు. ఈ ఇయర్ ఎండింగ్ లో కానీ, లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో కానీ లాంచింగ్ ఉంటుందని చెప్పాడు. బిగ్ లాంచ్ కోసం అతను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. చాలా ఎగ్జైటింగ్ గా, కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అదైతే నేను చెప్పగలను.
సినిమాల్లోకి రావడానికి అతను తన లుక్ ని మార్చుకున్నాడు. నెల రోజుల క్రితం చూస్తే గతంలో కంటే పూర్తిగా మారిపోయి కనిపించాడు. ఆల్మోస్ట్ అతను రెడీ అయిపోయినట్లే. ఏదైనా ఎగ్జైటింగ్ లవ్ స్టోరీ కోసం వెతుకుతున్నానని అన్నాడు. రైటర్ కోసం చూస్తున్నామని చెప్పాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఉండే అవకాశం ఉంది” అని నారా రోహిత్ తెలిపారు.
ఈ నేపధ్యంలో ఏడాది కూడా మోక్షజ్ఞ ఎంట్రీ అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వచ్చే ఏడాదిలో మాత్రం మోక్షజ్ఞను తెరపై చూడొచ్చనే ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
మరి అభిమానుల కలలు నెరవేరే రోజు ఎప్పుడు వస్తుంది? అన్న ప్రశ్న ఇంకా మిస్టరీగానే ఉంది.