సినిమా వార్తలు

ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ వెన్నుపోటు? సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టులు వైరల్!

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ మంచితనాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ అలుసుగా తీసుకున్నారా? ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిన తారక్ కాలాన్ని వృథా చేసి, ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారా? ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్త నందమూరి అభిమానుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది!

సినిమా రంగంలో కృతజ్ఞత లేని మనుషులు ఎక్కువైపోయారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. దీనికి ఉదాహరణగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరును నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సెన్సేషన్ తర్వాత ఎన్టీఆర్ స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది, ఆయన ఇప్పుడు నేషనల్ స్టార్.బాలీవుడ్ మేకర్స్ సైతం తారక్‌తో సినిమా చేసేందుకు వందల కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నది జగమెరిగిన సత్యం.

ఫ్లాప్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తే.. వెన్నుపోటు పొడిచారా?

కానీ, జూనియర్ ఎన్టీఆర్ తన మంచితనంతో ఆలోచించి, వరుస ఫ్లాపుల్లో ఉండి హిట్ కోసం వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్‌కు అవకాశం ఇవ్వాలని అనుకున్నారట. త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెబితే, తీరా ఇప్పుడు సీన్ రివర్స్ అయిందంటూ ప్రచారం జరుగుతోంది. సినిమాలో హీరో నువ్వు కాదు, అల్లు అర్జున్ అంటూ త్రివిక్రమ్ ప్లేట్ ఫిరాయించారని, దీంతో ఎన్టీఆర్ విలువైన సమయం అంతా వేస్ట్ అయిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

నమ్మకద్రోహంపై నెటిజన్ల ఫైర్:

నమ్మకంతో ఛాన్స్ ఇస్తే ఇలా వెన్నుపోటు పొడవడం ఏంటని, ఇటువంటి నమ్మక ద్రోహులను ఏం చేయాలో మీరే చెప్పాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. త్రివిక్రమ్ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది పక్కన పెడితే, తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రచారంతో ఫుల్ ఫైర్‌ లో ఉన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? త్రివిక్రమ్ నిజంగానే ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారా? కామెంట్ సెక్షన్‌లో తెలపండి.

Similar Posts