సినిమా వార్తలు

హిందీలో దిల్ రాజు రీఎంట్రీ… కాని సల్మాన్ తో కాదు, ఖిలాడీయే హీరో!

బాలీవుడ్‌లో దిల్ రాజు–సల్మాన్ ఖాన్ కాంబినేషన్ సినిమా వస్తుందన్న వార్తలతో సోషల్ మీడియా దద్దరిల్లింది. కానీ చివరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ అధికారిక ప్రకటనతో ఆ రూమర్స్ కి లైన్‌ వేసేసింది.

దిల్ రాజు స్వయంగా చెప్పిన క్లారిటీ: ప్రస్తుతం బాలీవుడ్‌లో మా బ్యానర్ లో ఉన్న ఏకైక సినిమా… అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్నదే!

పుకార్లన్నీ అవుట్‌డేటెడ్ – మీడియా ఊహాగానాలకే స్టాప్!

ప్రొడక్షన్ హౌస్ వెల్లడించిన ప్రకటన ప్రకారం:

“ఇటీవల దిల్ రాజు, SVC ప్రాజెక్ట్‌ల గురించి వస్తున్న వార్తలు అన్ని బేస్‌లెస్, వాస్తవానికి దూరం. పాత ఊహాగానాలను కొత్త డెవలప్మెంట్స్‌కి లింక్ చేయడం పూర్తిగా తప్పు.

ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ తో చేసే అనీస్ బజ్మీ దర్శకత్వ చిత్రాన్ని మాత్రమే డెవలప్ చేస్తున్నాం. ఇది ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. అధికారిక వివరాలు తరువాత చెప్పబడతాయి. అందువల్ల ధృవీకరణ లేకుండా వార్తలు రాయొద్దని మనవి.”

అక్షయ్ కుమార్ సినిమా – ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్?

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ చిత్రం దిల్ రాజు నిర్మించిన తెలుగు బ్లాక్‌బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ అని సమాచారం. అక్షయ్–అనీస్ కాంబో, ఫ్యామిలీ కామెడీ టచ్… బాలీవుడ్‌కు మంచి ఫిట్ అవుతుందని ట్రేడ్ కూడా చెప్పుకుంటుంది.

హిట్, జెర్సీ ఫ్లాప్‌ ల తర్వాత… దిల్ రాజు మళ్లీ బాలీవుడ్‌లో రిస్క్!

గతంలో దిల్ రాజు నిర్మించిన రెండు హిందీ రీమేక్‌లు – HIT, Jersey – బాక్సాఫీస్ వద్ద దారుణంగా పడిపోయాయి. దీంతో ఆయన బాలీవుడ్ అడుగులు కొంత వరకు వెనక్కి తీసుకున్నారు.

కానీ ఇప్పుడు…

అక్షయ్ కుమార్ తో దిల్ రాజు మరోసారి భారీగా గ్యాంబిల్ ఆడుతున్నాడు! ఈసారి లక్ కలిసి వస్తుందా? లేక మరోసారి రీమేక్ రిస్క్ వర్కౌట్ అవ్వదా?

సినీ వర్గాల్లో ఇదే హాట్ డిబేట్!

Similar Posts