కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకొని స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నహీరోయిన్ కీర్తిసురేష్‌( Keerthy Suresh). మలయాళంలో బాల తారగా కెరీర్‌ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత హీరోయిన్ గా అవతారమెత్తి మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాన్‌ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రలో జీవించి జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. అదేవిధంగా తక్కువ కాలంలోనే ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. అయితే అంత క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ కు ఇప్పుడు ఆఫర్స్ లేవు. తనకు తెలుసున్న దర్శక,నిర్మాతలతో టచ్ లో ఉంటూ ఒక్క ఆఫర్ ప్లేజ్ అంటోందిట. ఇలా ఎలా జరిగింది

దాదాపు తొమ్మిది నెలలుగా కీర్తి సురేష్ కి ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. కొత్త ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపించినా, చివర్లో మాత్రం ఆఫర్‌లు మరొకరికి వెళ్లిపోతున్నాయి. హిందీలో చేసిన తొలి చిత్రం ఫలితం ఇవ్వకపోవడం, తెలుగులో పెద్ద హీరోల సినిమాల నుండి దూరం కావడం, తమిళంలో అంత బలమైన మార్కెట్ లేకపోవడం—అన్ని కలిసి ఆమె కెరీర్‌కి పెద్ద గ్యాప్ తెచ్చాయి.

ఇక వ్యక్తిగత జీవితం వైపు వెళ్తే—గత ఏడాది డిసెంబర్‌లో ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత మూడు రోజుల్లోనే హిందీ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని, ప్రొఫెషనల్ కమిట్మెంట్ చూపించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు ఆపేది లేదని క్లియర్‌గా చెప్పినా, ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా సైన్ చేయలేకపోయింది.

ప్రస్తుతం కీర్తి ఎక్కువగా సోషల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉంటుంది. భర్త కూడా ఆమె కెరీర్ కోసం ఇండియాలోనే సెటిల్ అయినా, కొత్తగా ప్రాజెక్టులు రాకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

అలాగే వివాహానంతరం కీర్తి సురేష్ కాస్త బరువెక్కారనే కామెంట్స్‌ను ఎదుర్కొన్నారు. అలాంటి కామెంట్స్‌పై స్పందించిన కీర్తిసురేష్‌ పెళ్లి తర్వాత బరువు పెరిగిన విషయం నిజమేనన్నారు.. అయితే బరువు తగ్గడానికి కార్డియో కసరత్తులు చేసి స్లిమ్‌గా మారడానికి పోరాడానన్నారు. వారానికి 300 నిమిషాలు ప్రకారం ఎక్సర్‌సైజ్‌ చేసి ఇప్పుడు 9 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు.

2026లో అయినా కీర్తి సురేష్ మళ్లీ కెరీర్‌ని రీబిల్డ్ చేసుకొని, క్రేజ్‌ను రీడిఫైన్ చేస్తుందా? లేక ఇంకా ఖాళీ కాలం కొనసాగుతుందా? అన్నది చూడాలి.

, , , ,
You may also like
Latest Posts from