
రామ్ చరణ్ బిగ్ మిస్టేక్? బోల్డ్ సీన్స్ కు భయపడి వద్దన్నాడా?!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ (Toxic) చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్క గ్లింప్స్ వీడియోతోనే 100 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి, యూత్‌లో పూనకాలు తెప్పించిన ఈ సినిమా వెనుక ఒక షాకింగ్ సీక్రెట్ బయటపడింది. వాస్తవానికి ఈ కథ యష్ కంటే ముందే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళిందట. కానీ చరణ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
చరణ్ ఎందుకు వెనక్కి తగ్గారు?
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ పవర్‌ఫుల్ సబ్జెక్టును ముందుగా రామ్ చరణ్‌కే వినిపించారట. అయితే సినిమాలోని కంటెంట్ విన్న చరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
శృతి మించిన వయొలెన్స్: సినిమాలో హింస ఏ రేంజ్‌లో ఉంటుందంటే.. KGF కూడా దీని ముందు తక్కువే అనిపించేలా గీతూ స్క్రిప్ట్ సిద్ధం చేశారట.
బోల్డ్ సీన్స్ మోతాదు: కేవలం యాక్షన్ మాత్రమే కాదు, సినిమాలో బోల్డ్ సన్నివేశాల మోతాదు కూడా చాలా ఎక్కువగా ఉందట. ఆ రేంజ్ బోల్డ్ నెస్ ని మన తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరని భావించిన చరణ్, రిస్క్ చేయడం ఇష్టం లేక ఈ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు టాక్.
యష్ ఖాతాలో 1000 కోట్ల ప్రాజెక్ట్!
చరణ్ వదిలేసిన ఈ బంగారు బాతు లాంటి ప్రాజెక్ట్ ఇప్పుడు యష్ చేతుల్లోకి వెళ్ళింది. గ్లింప్స్ చూశాక కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయిపోయింది. యష్ మార్క్ యాటిట్యూడ్ ఈ వైల్డ్ స్టోరీకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. మార్చి 19న విడుదల కాబోతున్న ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్‌ను ఈజీగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాను మన దిల్ రాజు భారీ ధరకు తెలుగు రైట్స్ దక్కించుకోవడం మరో విశేషం.
రేపు విడుదల కాబోతున్న ‘టాక్సిక్’ టీజర్ కోసం యావత్ ఇండియా ఎదురుచూస్తోంది. ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. చరణ్ ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని చరణ్ ఈ సినిమా చేసి ఉంటే సీన్ వేరేలా ఉండేదేమో! కానీ లోకల్ ఆడియన్స్ సెెంటిమెంట్స్ ని గౌరవించి ఆయన వెనక్కి తగ్గడం కరెక్టే అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి యష్ ఆ బోల్డ్ అండ్ వైల్డ్ క్యారెక్టర్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్ చరణ్ తీసుకున్నది మంచి నిర్ణయమా లేక కెరీర్ లోనే పెద్ద పొరపాటా అనేది మార్చి 19న తేలిపోతుంది!
