సినిమా వార్తలు

కోల్డ్ వార్ ముగిసిందా? అల్లు అర్జున్ – త్రివిక్రమ్ రీయూనియన్ వెనక అసలు కథ

ఇండస్ట్రీలో కాంబినేషన్లు బ్రేక్ అయితే … మళ్లీ కలవడం అరుదు. కానీ కొన్ని జోడీల మధ్య ఉన్న క్రియేటివ్ కెమిస్ట్రీ, ఇగో లకన్నా పెద్దది. అలా ఇప్పుడు టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్ అవుతున్న ఒక పేరు… అల్లు అర్జున్ – త్రివిక్రమ్.

ఇద్దరి మధ్య విభేదాల కథ అందరికీ తెలిసిందే. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ అట్లీతో భారీ సై-ఫై ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పడం, ముందే చర్చలో ఉన్న త్రివిక్రమ్ సినిమాపై స్పష్టత ఇవ్వకపోవడం… ఇవన్నీ త్రివిక్రమ్‌ను అసంతృప్తికి గురి చేశాయి. ఆ సమయంలోనే ఆయన ఎన్టీఆర్‌తో భగవాన్ కార్తికేయ స్వామి నేపథ్యంతో మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను ప్రకటించడం, ఇండస్ట్రీలో “అల్లు – త్రివిక్రమ్ కాంబో ఇక క్లోజ్” అన్న టాక్‌ని బలపరిచింది.

కానీ పరిస్థితులు మారాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా లో బిజీగా ఉండటంతో, త్రివిక్రమ్ తన ఫోకస్‌ని మార్చి వెంకటేష్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. “ఆదర్శ కుటుంబం AK47” అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతోంది.

ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే… ఈ మధ్య అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మధ్య ఐస్ కరిగిపోయిందన్న వార్తలు. లేటెస్ట్ బజ్ ప్రకారం, స్వయంగా అల్లు అర్జునే త్రివిక్రమ్‌ను సంప్రదించి, గతంలో చర్చలో ఉన్న ఆ అంబిషియస్ మైథలాజికల్ ప్రాజెక్ట్‌ని మళ్లీ స్టార్ట్ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశాడట. ఎన్టీఆర్ సినిమా మొదలయ్యే ముందు, ఈసారి త్రివిక్రమ్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌నే పట్టాలనే ప్లాన్‌లో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. షూటింగ్ 2027లో మొదలయ్యే అవకాశం ఉందని టాక్.

ప్రస్తుతం “ఆదర్శ కుటుంబం AK47” పూర్తయిన వెంటనే, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఫ్లోర్స్‌కి వెళ్లే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. అసలు ఈ సడెన్ టర్న్‌కి కారణం ఏమిటి? త్రివిక్రమ్‌ను మళ్లీ ఒప్పించిన అంశం ఏది? అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ జోడీ మళ్లీ కలవబోతోందన్న వార్తే ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఈ రీయూనియన్ నిజంగా స్క్రీన్‌పై మరో మేజిక్ చేస్తుందా? అన్నది చూడాలి.

Similar Posts