కమల్ హాసన్, మణిరత్నం కలయికలో వచ్చిన భారీ అంచనాల చిత్రం థగ్ లైఫ్ గురువారం విడుదలైంది. కానీ విడుదలైన ఉదయం షో కే సినిమా భారీ డిజాస్టర్ అని స్పష్టం అయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలలో ఈవినింగ్ షోలకు జనం లేరు. చాలా చోట్ల షోలు కాన్సిల్ చేసారు.
ఇప్పుడా ఆ చర్చల మధ్య… మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాడు. దుల్కర్ గత కొంతకాలంగా వరస పెట్టి తెలుగు సినిమాలు చేస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. “మహానటి”, “సీతారామం”, “లక్కీ బాస్కర్” వంటి సూపర్ హిట్స్ లతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల్లో షూటింగ్ చేస్తున్నాడు. అయితే థగ్ లైఫ్ కు దుల్కర్ కి సంభందం ఏమిటంటారా?
తాజాగా తమిళ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, థగ్ లైఫ్ లో నటించడానికి వచ్చిన ఆఫర్ ను దుల్కర్ సల్మాన్ తిరస్కరించారు. డేట్స్ ఖాలీ లేక తప్పుకుని అందుకు , బదులుగా “లక్కీ బాస్కర్” సినిమాను ఎంచుకున్నారు. అందుకు అభిమానులు అతన్ని నిజంగానే లక్కీ అంటూ ప్రశంసిస్తున్నారు.
దుల్కర్ అభిమానులు సోషల్ మీడియాలో దుల్కర్ ని మెచ్చుకుంటూ, మంచి నిర్ణయం తీసుకున్నాడని పోస్ట్ లు పెడుతున్నారు. ఫైనల్ గా థగ్ లైఫ్ సినిమా భారీ ఫ్లాప్ కావడంతో, దుల్కర్ సల్మాన్ ‘ఆ సినిమా చేయలేదు’ అన్న విషయం అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. అందుకే దుల్కర్ పేరు, సంబంధిత పోస్ట్లు, ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.