సినిమా వార్తలు

“శోభన్ బాబు గారి శవాన్ని చూసే అర్హత నాకు లేదు” : ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం నటనలోనే కాదు, విలువలు పాటించడంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటారు. తాజాగా ఒక పాత ఇంటర్వ్యూలో దివంగత నటభూషణ శోభన్ బాబు గారి గురించి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. శోభన్ బాబు గారు మరణించినప్పుడు తాను ఎందుకు వెళ్లలేదో చెబుతూ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.

వారే మాకు ఇన్స్పిరేషన్..

ముందుగా తన సీనియర్ల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ.. “మా నాగార్జున బాబాయి, బాలబాబాయి, మరియు చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే మేము పెరిగాము. వారందరూ మాకు స్ఫూర్తి. ఈరోజు మేము ఇంత అద్భుతంగా డ్యాన్సులు చేస్తున్నామన్నా, నటిస్తున్నామన్నా అది మా సీనియర్లు మాకు నేర్పించిన విద్యే” అని ఎన్టీఆర్ కొనియాడారు.

అర్హత లేదనే వెళ్లలేదు..

శోభన్ బాబు గారి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఎన్టీఆర్ తెలిపారు. అయితే ఆయన అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై స్పందిస్తూ.. “ఆయన శవాన్ని దర్శించుకునే అర్హత నాకు ఇంకా రాలేదు అనిపించింది. అందుకే నేను వెళ్లలేదు” అని చాలా వినమ్రంగా చెప్పారు. ఒక గొప్ప నటుడి పట్ల ఎన్టీఆర్‌కు ఉన్న అపారమైన గౌరవానికి ఈ మాటలే నిదర్శనం.

అవార్డు అంకితం..

అంతేకాకుండా, తనకు వచ్చిన అవార్డును దివంగత శోభన్ బాబు గారికి అంకితం ఇస్తున్నట్లు ఎన్టీఆర్ ఆ వేదికపై ప్రకటించి అందరి మనసు గెలుచుకున్నారు.

Similar Posts