
ఆ డైరెక్టర్ నన్ను వాడుకొని వదిలేశాడు.. షూటింగ్ టైమ్ కి లావు ఎక్కానని తీసేశారు! బాంబు పేల్చిన ‘లెజెండ్’ బ్యూటీ!
యాక్ట్రెస్ రాధిక ఆప్టే గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కేవలం గ్లామర్ మీదనే కాకుండా పర్ఫార్మెన్స్‌తోనూ ఆడియన్స్‌ని ఫిదా చేయడం ఆమె స్టైల్. తెలుగులో బాలయ్య పక్కన ‘లెజెండ్’ సినిమాలో నటించి మెప్పించిన ఈ భామ, రీసెంట్ గా ఇండస్ట్రీలో ఉన్న ‘డబుల్ స్టాండర్డ్స్’ మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. బాడీ షేమింగ్ మరియు ఏజ్ ఫ్యాక్టర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆ 4 కేజీల బరువు నా కెరీర్‌నే మార్చేసింది!
రాధిక ఆప్టే మాట్లాడుతూ.. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ను గుర్తు చేసుకుంది. “ఒక డైరెక్టర్ నా కోసమే ఒక పవర్ఫుల్ స్టోరీ రాసుకున్నారు. షూటింగ్ మొదలయ్యే ముందు నేను ఒక ట్రిప్‌కు వెళ్లాను. అక్కడ డైట్ పక్కన పెట్టి నచ్చిన ఫుడ్ తిన్నాను, దాంతో 4 కేజీల వెయిట్ పెరిగాను.
షూటింగ్ కల్లా వెయిట్ తగ్గుతానని మేకర్స్‌కు ప్రామిస్ చేసినా వాళ్లు వినలేదు. కేవలం ఫోటో షూట్లో లావుగా కనిపించాను అనే నెపంతో నన్ను ఆ సినిమా నుంచి తీసేశారు. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది, నా ప్లేస్‌లో వచ్చిన నటి స్టార్ హీరోయిన్ అయిపోయింది” అంటూ తన బాధను షేర్ చేసుకుంది.

మెంటల్ గా డిస్టర్బ్ అయ్యా.. థెరపీ తీసుకున్నా!
ఆ సినిమా ఆఫర్ పోవడంతో తాను చాలా కాలం డిప్రెషన్లోకి వెళ్లానని, ఆ చేదు నిజం నుంచి బయటపడటానికి థెరపీ కూడా తీసుకోవాల్సి వచ్చిందని రాధిక ఆప్టే తెలిపింది. అయితే ఆ సంఘటన తనలో కొత్త కాన్ఫిడెన్స్ నింపిందని, ఇప్పుడు తను బాడీ వెయిట్ లేదా అందం గురించి అస్సలు టెన్షన్ పడటం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈవెన్ బిడ్డ పుట్టిన మూడు నెలలకే బరువు తగ్గకుండానే షూటింగ్లో పాల్గొన్నానని గర్వంగా చెప్పింది.

హీరోలకు ఒక రూల్.. హీరోయిన్లకు ఒక రూలా?
సినిమా ఇండస్ట్రీలో మగవాళ్లకు, ఆడవాళ్లకు మధ్య ఉన్న వివక్షను రాధిక ఎండగట్టింది. “పురుషులకు వయసు పెరగడం అంటే ఇండస్ట్రీలో ముసలితనం రావడం కాదు. వాళ్లు ఎంత ఏజ్ వచ్చినా హీరోలుగా కొనసాగుతారు. కానీ హీరోయిన్లకు ఏజ్ పెరిగితే మాత్రం అది ముసలితనంతో సమానం అన్నట్టు ట్రీట్ చేస్తారు. ఈ తేడా ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుంది” అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

మొత్తానికి, రాధిక ఆప్టే చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి!
