తమిళ ఇళయదళపతి విజయ్ ఫ్యాన్స్‌కి ఇప్పుడు గుండె ఆగినంత పనవుతోంది! ఆయన లాస్ట్ సినిమా ‘జన నాయకన్’ రిలీజ్ బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నా, అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. జనవరి 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా చేతికి అందలేదు. దీంతో చిత్ర యూనిట్ హుటాహుటిన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది!

అసలేం జరిగింది?

జన నాయకన్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా ఎప్పుడో పూర్తయ్యాయని టాక్. కానీ, ఏదో టెక్నికల్ రీజన్ వల్ల సెన్సార్ బోర్డు నుంచి ఇంకా సర్టిఫికేట్ ఇష్యూ కాలేదు. సర్టిఫికేట్ లేకపోవడంతో అటు తమిళనాడులో గానీ, ఇటు తెలుగు రాష్ట్రాల్లో గానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. దీంతో మేకర్స్ టెన్షన్‌తో కోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు.

కోర్టు ఏం చెప్పబోతోంది? ఈ కేసు విచారణ ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటలకు జరగనుంది. ఈరోజు సాయంత్రానికల్లా సెన్సార్ క్లియరెన్స్ వస్తుందా లేదా? జనవరి 9న సినిమా వస్తుందా రాదా? అనే దానిపై క్లారిటీ రానుంది. ఓవర్సీస్‌లో అయితే అడ్వాన్స్ సేల్స్ అదిరిపోతున్నాయి, కానీ లోకల్ మార్కెట్ అంతా ఇప్పుడు కోర్టు తీర్పు వైపు చూస్తోంది.

హెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ ‘జన నాయకన్’.. మన తెలుగు హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే!

మరి విజయ్ ‘చివరి వేట’ క్లీన్‌గా రిలీజ్ అవుతుందో లేదో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే!

సినిమా అప్‌డేట్స్ ఏ మాత్రం మిస్ అవ్వకూడదంటే మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి!

#Censor Certificate Delay, #Jana Nayagan, #KollyWood, #Madras High Court, #Thalapathy Vijay, #Vijay

By admin