నటుడు కమలహాసన్‌(Kamal Haasan), శంకర్‌(S. Shankar) కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం భారతీయుడు.. ఏఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 1996లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. 26 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా ఇండియన్‌–2 రూపొందింది. అదే దర్శకుడు, నటుడు నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది.

ఆ తర్వాత దర్శకుడు శంకర్‌ తొలిసారిగా తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కించిన చిత్రం గేమ్‌ చేంజర్‌. బడ్జెట్లో భారీగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై డిజాస్టర్ అయ్యింది. దీంతో దర్శకుడు శంకర్‌ నెక్ట్స్ చిత్రం ఏంటన్న విషయంపై జరుగుతున్న చర్చ మొదలైంది. దానికి తోడు శంకర్ ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇండియన్‌–3 (Indian 3) చిత్రంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఇండియన్ 3 వస్తుందా రాదా అనే డైలమో మొదలైంది.

మొదట శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్ 2 ఒక్కటే సరిపోతుందనుకున్నారు. కానీ భారీ నిడివి, భారీ ఖర్చు కారణంగా సినిమా రెండు పార్టులుగా విడగొట్టారు. అందులో రెండో భాగం ఇప్పటికే వచ్చేసింది. అసలు ప్లాన్ ప్రకారం జూలైలోనే ఇండియన్ 3 ను రిలీజ్ చేసేలా, మిగిలిన షూట్‌ను త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు.

కానీ… ఇండియన్ 2 ఫలితం మాత్రం షాకింగ్ కావటంతో, డిజాస్టర్‌గా మిగిలిపోయి, సోషల్ మీడియాలో తీవ్ర ట్రోల్స్ ఎదుర్కొంది. కమల్ నటనపై కూడా భారీ విమర్శలు వచ్చాయి. ఇండియన్‌ 2 మూవీ భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. దాదాపు 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ చిత్రం 73 కోట్ల (నెట్‌) వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

దీంతో క‌మ‌ల్‌హాస‌న్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన ఇండియ‌న్ 2 బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. తెలుగులో కూడా భార‌తీయుడు 2 మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో ప‌ద‌మూడు కోట్లు మాత్రమే క‌లెక్ష‌న్స్ అందుకుంది. సుమారు రూ. 12 కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను ఎదుర్కొంది.

ఈ పరిస్థితుల్లో ఇండియన్ 3 పనులు హఠాత్తుగా ఆగిపోయాయి. ఇదే సమయంలో శంకర్ తీస్తున్న గేమ్ ఛేంజర్ , కమల్ హాసన్ చేస్తున్న థగ్ లైఫ్ రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది.

తాజాగా, ఇండియన్ 3 కోసం శంకర్ – కమల్ – నిర్మాతలు కలిసి ఎన్నో మీటింగ్స్ పెట్టుకున్నారు. కానీ మిగిలిన షూట్ పూర్తిచేయడానికి కావాల్సిన భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారట. మరోవైపు శంకర్ కూడా నిర్మాతలు చెప్పిన కట్టుబాటు ఖర్చులో సినిమా పూర్తి చేయడానికి ఒప్పుకోవడం లేదని టాక్.

అలా “బడ్జెట్ బాంబ్” కారణంగా ఇండియన్ 3 నిలిచిపోయింది. ఇక ఈ సమస్యలన్నీ సర్దుబాటు అయితే మాత్రమే సినిమా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

, , , , , ,
You may also like
Latest Posts from