
బాహుబలిపై రాజమౌళి పశ్చాత్తాపం! అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జున మాస్టర్ ప్లాన్.. అసలు మ్యాటర్ ఇదే!
భారతీయ సినిమా ఇమేజ్‌ను ప్రపంచపటంలో మరో మెట్టు ఎక్కించే అద్భుతం మన హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైంది. అక్కినేని నాగార్జున సారథ్యంలోని ‘అన్నపూర్ణ స్టూడియోస్’, శోభు యార్లగడ్డకు చెందిన ‘మిహిరా విజువల్ ల్యాబ్స్’ కలిసి టాలీవుడ్‌లో ఒక సరికొత్త విప్లవానికి తెరలేపాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ‘అవెంజర్స్’, ‘స్పౌడర్ మ్యాన్’ వంటి చిత్రాలకు ప్రాణం పోసిన అత్యున్నత ‘మోషన్ క్యాప్చర్’ (MoCap) సాంకేతికతను ఇప్పుడు మన భాగ్యనగరానికి తీసుకొచ్చారు.
రాజమౌళి సంచలన వ్యాఖ్యలు: బాహుబలిపై పశ్చాత్తాపం!
ఈ అత్యాధునిక ల్యాబ్‌ను ప్రారంభించిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. “ఒకప్పుడు బాహుబలి, ఈగ వంటి సినిమాలు చేసేటప్పుడు ఈ టెక్నాలజీ మన దగ్గరే ఉండి ఉంటే, వాటిని ఇంకా అద్భుతంగా తీసేవాడిని” అని ఆయన ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు, సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తాను తీస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ ‘వారణాసి’ లోని మోస్ట్ ఇంపార్టెంట్ సీన్స్‌ను ఇప్పటికే ఈ ల్యాబ్‌లోనే షూట్ చేశామని, వచ్చిన రిజల్ట్స్ చూసి తన మైండ్ బ్లాక్ అయ్యిందని వెల్లడించారు.

నాగార్జున, శోభు యార్లగడ్డ ఏమన్నారంటే?
కింగ్ నాగార్జున: “దశాబ్దాలుగా మన మేకర్స్ గ్లోబల్ స్టాండర్డ్ కథలు చెప్పాలనుకుంటున్నారు, కానీ టెక్నాలజీ అందక ఆగిపోయేవారు. ఇప్పుడు ఆ అడ్డంకి లేదు. సైన్స్ ఫిక్షన్ నుండి ఎపిక్ డ్రామాల వరకు ఏదైనా సరే.. ఇకపై హైదరాబాద్‌లోని మన ల్యాబ్‌లోనే సాధ్యం.”
శోభు యార్లగడ్డ: “మనం ప్రపంచంతో పోటీ పడాలంటే హాలీవుడ్ లెవల్ టెక్నాలజీని ఇక్కడే నిర్మించుకోవాలి. రాజమౌళి గారు తన ‘వారణాసి’ కోసం ఈ ఫెసిలిటీని వాడటమే మా నమ్మకానికి నిదర్శనం.”

మైండ్ బ్లాక్ చేసే ‘Vicon Valkyrie’ కెమెరాల ప్రత్యేకత!
ఈ ల్యాబ్‌లో వాడిన Vicon Valkyrie (VK26) కెమెరాలు మామూలువి కావు.. ఇవి హాలీవుడ్ స్థాయి టెక్నాలజీకి పరాకాష్ట. అత్యంత ఖచ్చితత్వం (Sub-millimeter Accuracy): నటుల కదలికలను మిల్లీమీటర్ కంటే తక్కువ వ్యత్యాసంతో ఇవి పట్టుకుంటాయి. అంటే కనురెప్పల కదలికను కూడా గ్రాఫిక్స్‌లో రియల్‌గా చూపించవచ్చు.
హై-స్పీడ్ ట్రాకింగ్: అత్యంత వేగంగా జరిగే ఫైట్ సీక్వెన్స్‌లను కూడా ఏమాత్రం బ్లర్ లేకుండా ఇవి రికార్డ్ చేస్తాయి.
రియల్ టైమ్ స్ట్రీమింగ్: షూటింగ్ జరుగుతున్నప్పుడే గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో ‘అన్‌రియల్ ఇంజిన్’ ద్వారా మానిటర్ మీద వెంటనే చూడవచ్చు. దీనివల్ల టైమ్, ఖర్చు భారీగా తగ్గుతాయి.
ఫేషియల్ మ్యాజిక్: ఈ కెమెరాలతో పాటు వాడే హెడ్-మౌంటెడ్ కెమెరాలు నటుల ముఖంపై పలికే ప్రతి భావోద్వేగాన్ని అద్భుతమైన డెప్త్‌తో క్యాప్చర్ చేస్తాయి.
ఏదైమైనా:
టాలీవుడ్ అంటే కేవలం మాస్ మసాలా మాత్రమే కాదు.. టెక్నాలజీలోనూ మేము బాప్ అని అన్నపూర్ణ స్టూడియోస్ నిరూపించింది. రాజమౌళి విజన్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, ఈ ‘వైకాన్ వాల్కైరీ’ కెమెరాల పవర్ కలిస్తే వచ్చే ఏడాది థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ‘వారణాసి’ సినిమాలో ఈ టెక్నాలజీ సృష్టించబోయే విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచే పిచ్చెక్కిపోతున్నారు!
