తెలుగు పరిశ్రమలో మంచు లక్ష్మి అనగానే గుర్తొచ్చేది — bold personality, outspoken opinions, unapologetic presence! టీవీ టాక్ షోల్లో హోస్ట్‌గా, వెబ్‌సిరీస్‌లలో యాక్టివ్ గానూ, టాప్ షెడ్యూల్ సెలబ్రిటీలా బాలీవుడ్ ఈవెంట్లకు వెళ్లే తరహాలోనూ… తనదైన మార్క్‌ను పెట్టిన మల్టీ-ఫేసెటెడ్ ఆర్టిస్ట్. అలాంటిది…తమ మంచు కుటుంబం తీస్తున్న ‘కన్నప్ప’ లాంటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్‌లో ఆమె లేదేంటీ?

ఇప్పుడు అదే ప్రశ్నకు సరదాగా, షార్ప్‌గా జవాబిచ్చింది మంచు లక్ష్మి — ఓ ప్రెస్ మీట్ వేదికగా.

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మంచు లక్ష్మి, “కన్నప్ప” సినిమాలో తన పేరు లేకపోవడంపై స్పందించింది. మీడియా అడిగిన ప్రశ్నకు నవ్వుతూ – “నన్ను సినిమాలోకి తీసుకుంటే… మిగిలిన నటులు ఎవ్వరూ కనిపించరేమో!” అయినా నన్ను ఎందుకు తీసుకోలేదో విష్ణునినే అడగాలి! అంటూ చురకలు వేసింది.

దీంతో పాటు, “నాకు సూటయ్యే పాత్ర లేకపోవడం వల్లే విష్ణు ఆఫర్ ఇవ్వలేదు. ఉంటే ఎప్పుడో ఇచ్చేవాడు. కానీ మనం అంతా కలిసి నటిస్తే అది ఫ్యామిలీ డ్రామా అయిపోతుంది!” అంటూ సరదాగా క్లారిటీ ఇచ్చింది.

“సపోర్ట్ కేవలం ఒక్క సినిమాకి ఇవ్వడమే కాదు…”

మంచు కుటుంబం అంతా వేర్వేరు మార్గాల్లో కెరీర్‌ని కొనసాగిస్తుండగా, వారి మధ్య విభేదాలు వార్తలకెక్కాయి. ఇదే సందర్భంలో… “మీ సోదరులకు మీరు మద్దతు ఇస్తారా?” అన్న ప్రశ్నకు లక్ష్మి బదులూ అంతే క్లాస్‌గా ఇచ్చింది: “సినిమాలో ఛాన్స్ ఇవ్వడమే మద్దతు కాదు. వాళ్లకు నా అండ ఎప్పుడూ ఉంటుంది.”

ఈ వ్యాఖ్యతో ఆమె… ‘ఫ్యామిలీ’ గొడవలపై నోరు విప్పకుండా, మంచు మనోజ్ పక్షాన ఉన్నట్లుగా మాట్లాడింది.

కెరీర్ విషయానికి వస్తే…

తెలుగులో కొన్ని ఫిల్మ్స్ చేసిన తర్వాత, ఇప్పుడు మంచు లక్ష్మి బాలీవుడ్‌కు చెక్కేసింది. ప్రస్తుతం ముంబయిలో ఉంటూ, ప్రముఖ రియాలిటీ షో “The Traitors” కోసం సిద్ధమవుతోందని సమాచారం. స్టయిలిష్ ప్రెజెన్స్, స్పైసీ కామెంట్స్‌తో మళ్లీ ఒకసారి బజ్‌కి కేంద్రంగా మారనుంది.

#Kannappa, #Manchu Lakshmi, #Manchu Mohan Babu, #Manchu Vishnu

By admin