టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ ఇప్పుడు ఓపెనింగ్స్ విషయంలో హాట్ టాపిక్ అయింది. నీరజ కోన దర్శకత్వంలో, శ్రీనిధి శెట్టి – రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్లు గ్రాస్ వసూలు చేసి, దాదాపు రూ.2 కోట్లు నెట్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

కానీ ఈ కలెక్షన్లపై సోషల్ మీడియాలో మాత్రం మిక్స్ టాక్ నడుస్తోంది. కారణం — టిల్లు సిరీస్‌తో సెన్సేషన్‌ సృష్టించిన సిద్ధు, ఇప్పుడు ఆ రేంజ్ హైప్‌ను రిపీట్ చేయలేకపోయారనే అభిప్రాయం ట్రేడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

‘జాక్’ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా ఫోకస్‌తో సిద్ధు చేసినా, తెలుసు కదా ప్రమోషన్లలో మాత్రం మేకర్స్ పెద్దగా ఎఫెక్ట్ చూపలేదనే విమర్శ ఉంది. రిలీజ్‌కు ముందు వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ పెద్దగా హైప్ రేపలేదు. యూత్ ఫాలోయింగ్ ఉన్నా, బోల్డ్ ఎలిమెంట్స్ హింట్స్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉన్నారని అంటున్నారు.

దీంతో సినిమా బజ్ అంచనాలకు తగ్గట్టుగా రాకపోవడంతో, ఓపెనింగ్స్ కూడా అంత సాలిడ్‌గా రాలేదన్న మాట.

ట్రేడ్ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే — “టిల్లు క్రేజ్ స్థాయిలో బజ్ రాకపోవడం వల్లే తెలుసు కదా కాస్త స్లోగా స్టార్ట్ అయ్యింది, కానీ వర్డ్ ఆఫ్ మౌత్‌పై భవిష్యత్తు కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి” అని విశ్లేషిస్తున్నారు.

ఇక ప్రశ్న ఒక్కటే – టిల్లు స్టార్డమ్‌ను మళ్లీ క్యాష్ చేసుకోగలడా సిద్ధు? లేక తెలుసు కదా కూడా జాక్ ట్రాక్‌నే ఫాలో అవుతుందా?

, , , , , ,
You may also like
Latest Posts from