గత కొద్ది రోజులుగా బాలీవుడ్‌లో పారితోషిక అసమానత (Pay Disparity) పై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. చాలా మంది హీరోయిన్లు తమకు హీరోల కంటే తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, ఈ చర్చల మధ్య నేషనల్ అవార్డు విజేత ప్రియమణి మాత్రం మరో కోణం చూపించారు — ఆమె మాటల్లో అది ఒక రియాలిటీ చెక్ లాంటిదే.
“సినిమా ఇండస్ట్రీలో పారితోషికం జెండర్ ఆధారంగా నిర్ణయించబడదు. అది పూర్తిగా మార్కెట్ డైనమిక్స్ మీద ఆధారపడి ఉంటుంది,” అని ప్రియమణి స్పష్టం చేశారు.
ఆమె చెప్పిన మాటల్లో స్పష్టత ఉంది —
“ ఇది చాలా సింపుల్. నువ్వు నీ విలువ తెలుసుకుంటే, నీ స్థాయి రేట్ అడుగుతావు. నీ విలువకు తగ్గదే నీకు వస్తుంది. ఇదే నా అనుభవం,” అని తెలిపారు.
ఇంకా ఆమె కంటిన్యూ చేస్తూ —
“నేను నా మార్కెట్ విలువ బాగా తెలుసు. నేను తెరపై ఏమి తెస్తానో నాకు తెలుసు. నేను అర్హత ఉన్నదానికే కోట్ చేస్తాను — అదీ అంతే.”
అలాగే తానెప్పుడూ పారితోషికానికి ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. తనతో పాటు నటించిన వారి కన్నా తక్కువ మ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలిపింది. పారితోషికం అనేది పాత్ర నిడివి, నా నటన ఆధారంగా దాన్ని అందిస్తారన్న అవగాహన ఉందని చెప్పిందీ భామ. తాను అర్హురాలీని అని భావిస్తే డిమాండ్ చేస్తానంటోంది. అనవసరంగా రెమ్యూనరేషన్ పెంచాలని కోరనని చెబుతోందీ అమ్మడు.
సౌత్ లో ఉదయం 8 గంటలకు షూటింగ్ ప్రారంభిస్తామని షెడ్యూల్ ఇస్తే కచ్చితంగా ఆ సమయానికి వచ్చేస్తామని ప్రియమణి చెప్పింది. కానీ నార్త్ లో ఆ సమయానికి నటీనటులు ఇంటినుంచి బయల్దేరుతారని తెలిపింది. ఇటీవల సినీ ఇండస్ట్రీలో 8 గంటల పని డిమాండ్ నేపథ్యంలో ప్రియమణి వ్యాఖ్యాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రస్తుతం వరుస బిజీగా ఉందీ అమ్మడు. ఇటీవలే ‘ఆఫీసర్ ఆఫ్ డ్యూటీ’, ‘ది గుడ్ వైఫ్’లతో ప్రేక్షకుల ను పలకరించారు. కోలీవుడ్ అగ్ర కథా నాయకుడు విజయ్ ప్రధాన పాత్రలో రానున్న ‘జన నాయ గన్’లో నటిస్తోంది.

