ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓ పవర్‌ఫుల్ ప్లాట్‌ఫారమ్. ఇది పేరు తెచ్చే వేదిక కావచ్చు… అదే పనిగా పరువు తీసే ఆయుధం కూడా. ఇక్కడ ఓ మాట, ఓ ట్వీట్, ఓ మెచ్చుకోలు కూడా… ఎవరో ప్రొఫెషనల్స్ గానే కాదు, జనాల అభిప్రాయాల్లోనూ ముద్ర వేస్తుంది. ఇక… సినిమాల విషయంలో అయితే అది రెడీగా ఉండే కోర్ట్ రూమ్. ప్రతి అభిప్రాయం… ప్రతి మెచ్చుకోలు… ప్రతి విమర్శ… విచారణకు లోనవుతుంది. అదే పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటున్నారు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.
కార్తీక్ సుబ్బరాజ్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చే సినిమా “పిజ్జా” — హారర్ థ్రిల్లర్‌కి కొత్త ఊపిరి తీసుకువచ్చిన చిత్రం.
ఆ తర్వాత “జిగర్తాండ” సినిమాతో దర్శకుడిగా బలమైన మార్కు సంపాదించాడు. తెలుగులో ఇది “గద్దలకొండ గణేష్”గా రీమేక్ అయింది. ఈ రెండు సినిమాల విజయంతో అతను తమిళ యువ దర్శకుల్లో ఒక ‘ప్రామిసింగ్ క్రియేటివ్ ఫోర్స్’గా అభివృద్ధి చెందాడు. కానీ తర్వాతి ప్రయాణం మాత్రం ప్లాఫ్ ల పరంపరగా సాగింది. అయితే అదే సమయంలో అతను సోషల్ మీడియా పోస్ట్ లు తీవ్ర విమర్శలకు లోను అవుతున్నాయి.
ఫ్లాపులకే ఫుల్ ఖుషీగా కంగ్రాట్స్ ఎందుకు?
“ఇండియన్ 2” గురించి ట్వీట్ చేస్తూ – “శంకర్ గారి కొన్ని సీన్స్ అద్భుతంగా ఉన్నాయి.” ఆ సినిమా డిజాస్టర్.
“గేమ్ చేంజర్” గురించి – “చరణ్ గారు హిట్ ఇచ్చారు, శంకర్ గారికి కంగ్రాట్స్.”..ఈ సినిమా డిజాస్టర్
“థగ్ లైఫ్” గురించి – “మణిరత్నం వైబ్ కనిపించింది. మాస్టర్ పీస్.” ఆ సినిమా డిజాస్టర్
అవి అన్నీ ఒకే పాయింట్‌కు దారితీస్తున్నాయి — ఫ్లాప్ సినిమాల్ని పొగడుతూ, ఇండస్ట్రీ పెద్దల్ని మేనేజ్ చేయాలనే ప్రయత్నమేనా?
“హిట్లు తీయలేకపోతున్నావు. ఫ్లాప్‌లను గుర్తించ లేకపోతున్నావు. ఫ్లాప్ తీసినవారికి ట్వీట్ చేసిమెచ్చుకోవడమే నీ పని అయిపోయిందా?” అని సోషల్ మీడియా జనం ప్రశ్నిస్తున్నారు.
స్క్రిప్ట్‌తో పాటు సోషల్ స్క్రిప్ట్ కూడా రాయడం నేర్చుకోవాల్సిందేనా?!